ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతిరోజు ఊహించని మలుపులు తిరుగుతూ చంద్రబాబు జగన్ ల ఎత్తుకు పైఎత్తులకు కేంద్రంగా మారింది. ఎత్తి పరిస్తుతులలోను వచ్చే ఎన్నికలలో గెలిచి తీరాలి అని వ్యూహాలు రచిస్తున్న చంద్రబాబు గత మూడు నెలల నుంచి తన పై పెరిగిపోతున్న ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు అన్ని దారులూ అన్వేషిస్తున్నారు. అందుకే తన పుట్టినరోజు నాడు పన్నెండు గంటల నిరాహారదీక్ష చేసినా నిన్న తిరుపతిలో ధర్మపోరాట దీక్ష చేసినా ప్రతి విషయంలోనూ తన మార్క్ ను చూపెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీపై ఉన్న వ్యతిరేకత తమ పార్టీ పై పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు చంద్రబాబు. 
CHANDRA BABU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలాంటి పరిస్థుతులలో చంద్రబాబు ఆలోచనల నుండి వచ్చిన ఒక విషయం ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాబు మనసులో నుండి వచ్చిన ఐడియా ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుండి పదివేల మంది ముఖ్య కార్యకర్తలను ఎంపికచేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని బాబు మాష్టర్ ప్లాన్ అని అంటున్నారు. దాదాపు రెండున్నర లక్షల మంది ఎంపిక చేసిన కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఈశిక్షణ తరువాత గత నాలుగేళ్లలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా బీజేపీ రాష్ట్రానికి చేసిన మోసాన్ని ఈకార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఆగ్రామంలో తెలుగుదేశం పార్టీని బలపరుస్తున్న గ్రామ పెద్దలతో కలిసి కేంద్ర ప్రభుత్వం బాబుని ఏవిధంగా మోసం చేసింది అనే విషయాన్ని వివరిస్తారని తెలుస్తోంది.  
CHANDRA BABU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అంతేకాదు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఈ కార్యకర్తలు వైసీపీ, బీజేపీ లోపాయికారీ ఒప్పందాలను గ్రామ ప్రజల స్థాయికి తీసుకు వెళ్ళేలా ఒక సరికొత్త వ్యూహాన్ని చంద్రబాబు డిజైన్ చేస్తున్నట్లు టాక్. దీనికితోడు అతి త్వరలో తెలుగుదేశం ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన నిరుద్యోగ భృతి అమలు కూడ మరో రెండు మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
JAGAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలా బాబు తన సుశిక్షితులైన కార్యకర్తలతో ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాల బాట పట్టబోతుంటే జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు నాయకులు దిగువ శ్రేణి నాయకులు అన్ని నియోజక వర్గాలలో ఉన్నారు కాని కార్యకర్తల విషయంలో చంద్రబాబు ఆలోచిస్తున్నంత వ్యూహాత్మకంగా జగన్ ఆలోచించి అడుగులు వేయలేకపోతున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈవిషయాలను దృష్టిలో పెట్టుకునే కాబోలు జగన్ రాబోతున్న ఎన్నికలలో తన కుటుంబ సభ్యులందరినీ రంగంలోకి దింపి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తల స్థాయికి ధీటైన రీతిలో తన పార్టీ కార్యకర్తల సంఖ్యను పెంచడమే కాకుండా కార్యకర్తలను ఉత్సాహ పరచడానికి అనేక వ్యూహాలను జగన్ కూడా ఆలోచనలు చేస్తున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: