తెలంగాణ మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌లో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శ్రీకారం చుట్టారు. తొలుత నేటి ఉదయం ఎల్బీనగర్ చింతలకుంట చెక్ పోస్ట్ వద్ద అండర్ పాస్‌ను ఆయన ప్రారంభించారు. కాగా, మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. వాహన శ్రేణిలో ఉన్న ఎంపీ మల్లారెడ్డి వాహనం ఢీకొని ఓ వ్యక్తి గాయపడ్డాడు. క్షతగాత్రుడిని హుటాహుటిన కామినేని ఆస్పత్రికి తరలించారు. కేటీఆర్.. ఉప్పల్‌ నుంచి రామాంతపూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Hyderabad’s Chintalkunta underpass opened by KTR
ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో నగరంలోని పలు చోట్ల పర్యటించారు. ఎల్బీనగర్ కారిడార్‌లో భాగంగా చింతలకుంట చౌరస్తా వద్ద నిర్మించిన అండర్‌పాస్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ అండర్‌పాస్‌తో విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తగ్గనుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా అందుబాటులోకి వచ్చిన ప్రాజెక్టులో ఇది మూడోది కావడం విశేషం. రూ. 18.70 కోట్ల వ్యయంతో ఈ అండర్‌పాస్ నిర్మించారు.
Image result for ktr security
దేశంలోనే అధునాతనంగా ప్రీకాస్ట్‌ విధానంలో స్లాబ్‌లు, గోడలను రూపొందించి.. అత్యంత వేగంగా ఈ అండర్‌పాస్ నిర్మాణాన్ని పూర్తిచేశారు. అండర్‌పాస్‌ గోడలకు ఇరువైపులా ప్రయాణికులను ఆకట్టుకునేలా రంగురంగుల చిత్రాలను రూపొందించారు.  ఈ అండర్‌పాస్‌తో విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తగ్గనుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇన్నర్‌ రింగురోడ్డులో సంతోష్‌నగర్‌ నుంచి వచ్చే భారీ వాహనాలతో పాటు, నగరం నుంచి సైదాబాద్‌- చంపాపేట- బైరామల్‌గూడ మీదుగా వచ్చే భారీ వాహనాలు సాగర్‌రింగ్‌రోడ్డు చౌరస్తా మీదుగా చింతల్‌కుంట అండర్‌పాస్‌ నుంచి విజయవాడ వైపు సులువుగా వెళ్లేందుకు వీలవుతుంది. ఇదిలా ఉంటే..మంత్రి కేటీఆర్ ఉప్పల్ నుంచి రామాంతపూర్ బయలుదేరుతుండగా ఆయన కాన్వాల్‌లో ప్రమాదం జరిగింది.  వాహన శ్రేణిలో ఉన్న ఎంపీ మల్లారెడ్డి వాహనం ఢీకొని ఓ వ్యక్తి గాయపడ్డారు. దీంతో గాయాలైన వ్యక్తిని వెంటనే కామినేని ఆస్సత్రికి తరలించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: