భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛ్ఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. ఇది ప్రతి రోజూ ఒక కోటీ అరవై లక్షల ప్రయాణీకులను గమ్యం చేరుస్తూండడమే కాక మరో పది లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తోంది.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు రైలు ప్రయాణాలు చేయాల్సిందే. ప్రతిరోజూ వేల మంది ప్రయాణించే రైలులో టీ, కాఫి,స్నాక్స్, భోజన వసతి ఉంటుంది.  ముఖ్యంగా పేద ప్రజలు ఎక్కువగా టీ తాగే అలవాటు ఉంటుంది.

ప్రయాణ సమయాల్లో చిక్కగా లేకపోయినా సరే టీ మీద మక్కువతో తాగేస్తుంటారు.  ఈ మద్య ప్రతి విషయంలో మోసం..దగా..అక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే.  ఇక రైలులో ప్రయాణించే వారికి భోజన విషయాల్లో కూడా ఎన్నో ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.  సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే మాత్రం రైలులో టీ తాగాలంటే అసహ్యించుకుంటారు.
 Bath room water Tea in Train  - Sakshi
ఓ టీ అమ్మే వ్యక్తి బాత్‌ రూం డోర్‌ కొట్టి చాయ్‌ అనగానే అందులోంచి మరో వ్యక్తి మూడు చాయ్‌ క్యాన్‌లను అతని చేతికి అందించాడు. అందులో ఓ క్యాన్‌ని ఫ్లాట్‌ ఫాంపై ఉన్న మరో టీ అమ్మే వ్యక్తికి ఇచ్చాడు. మిగతా రెండు టీ క్యాన్‌లను వారిద్దరూ తీసుకెళ్లారు. అయితే బాత్ రూమ్ లో నుంచి వచ్చే వ్యక్తి అక్కడ నిలబడ్డ వ్యక్తికి ఇచ్చిన వ్యవహారం..నవ్వూ చూస్తుంటే..అందులో ఏదో గూడుపుఠానీ జరిగినట్లు కనిపిస్తుంది.

ఈ వ్యవహారాన్ని ఓ ఔత్సాహికుడు తన వీడియోలో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అంతే కాదు ఈ తతంగాన్నంతా వీడియో తీసిన వ్యక్తి వారిని ప్రశ్నించగా తడబడుకుంటూ అక్కడి నుంచి నిదానంగా జారుకున్నారు. వీరంతా తెలుగులోనే మాట్లాడటంతో ఈ ఘటన జరిగింది తెలుగు రాష్ట్రాల్లోనే అనే విషయం స్పష్టమవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: