2014 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ స్థాపించారు. అయితే అప్పుడు జరిగిన ఎన్నికలలో పోటీ చెయ్యకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి చంద్రబాబును భుజాన మోసుకున్నారు. అప్పటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అతి స్వల్ప మెజార్టీతో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి రావడం జరిగింది. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా చంద్రబాబుకు భజన చేస్తూ నాలుగు సంవత్సరాలు గడిపారు.

Image result for janasena left parties

అయితే ఆ తర్వాత అడపాదడపా కొన్ని జిల్లాలలో జనసేన పార్టీ తరపున పర్యటనలు చేపడుతూ వామపక్షాలతో కలిసి నడిచారు. ఇదే సమయంలో వామపక్షా నేతలు కూడా జనసేన పార్టీ తో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపించారు. ఈ నేపధ్యంలో చాలా పోరాటాలలో వామపక్ష పార్టీలను  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాడుకోవడం జరిగింది.

Image result for janasena left parties

అయితే చివరాకరికి రాజకీయాల మీద ఎటువంటి స్పష్టత లేని పవన్ కళ్యాణ్ వామపక్ష పోరాటాల్ని వాడుకుని...చివరికి.. బీజేపీ పంచన చేరిపోయారు. దీంతో వామపక్ష పార్టీల లో ఒకటైన సీపీఐ పార్టీ వైసీపీ వైపు చూస్తుంది.

Image result for janasena left parties

గతంలో వైసీపీకి సీపీఐ పార్టీ ల మధ్య సత్సంబంధాలు బానే ఉన్నాయి. ఇటీవల విశాఖలో జరిగిన వంచన సభలో వైసీపీ తో కలిసి సీపీఐ కూడా సభలో పాల్గొనడం జరిగింది. ఈ పరిణామంతో వామపక్ష పార్టీలు జనసేన పార్టీకి దూరమైనట్లు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: