నవ్యాంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు నిద్రాహారాలు మాని కష్టపడుతున్నానంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడ చూసినా ఉపన్యాసాలు దంచి కొడుతున్నారు..కానీ ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో నాణ్యతలోని డొల్లతనం మరోసారి బయటపడింది. వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన తాత్కాలిక సచివాలయం తొలి నుంచి వాన నీటి లీకులతో వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్లో కురిసిన చిన్నపాటి వర్షానికి తొలిసారి ఏపీ సెక్రటేరియట్ కారింది. వివిధ చాంబర్లలోకి కుండపోతగా నీళ్లు పడ్డాయి.
rainwater leakage haunts y s jagan’s chamber in secretariat
అప్పట్లో ఏపీ ప్రభుత్వం అందులో కుట్ర కోణాన్ని అనుమానించింది. తమపై ప్రతిపక్షాలు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మీడియాను కూడా అదరగొట్టారు. అయితే  బాబుగారి మాటలు `వర్షపు`నీటి మూటలని తాజాగా మరోసారి రుజువైంది. తాజాగా మంగళవారం నాడు జగన్ చాంబర్ లో మరోసారి వర్షపు నీరు లీకేజీ కావడం చంద్రబాబు నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.  గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చాంబర్‌లోకి నీళ్లు కారడంతో.. కుట్ర ఉండవచ్చునని ప్రభుత్వ పెద్దలు అన్నారు. దానిపై విచారణకు కమిటీ కూడా వేశారు.

అయితే ఆ తర్వాత కూడా ఏపీ సెక్రటేరియట్ కారడం ఆగలేదు. గత ఏడాది పలుమార్లు ఇలాంటి లీకేజీలు చోటు చేసుకోగా.. తాజాగా మంగళవారం మరోసారి అలాంటి సంఘటనే చోటు చేసుకుంది.తాజాగా మళ్లీ పాత సీన్ రిపీటవడంతో కోట్లు ఖర్చుపెట్టి వెలగపూడిలో నిర్మించిన ఏపీ సచివాలయ డొల్లతనం మరోసారి బయటపడినట్లయింది. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ గప్పాలు కొట్టే చంద్రబాబు....చిన్నపాటి లీకేజీని కూడా అరికట్టలేకపోయారు.

చిన్నపాటి వర్షానికే ఈ పరిస్థితి ఉంటే....ఇక భారీ వర్షాలు పడితే పరిస్థితి ఏమిటో అని పలువురు సచివాలయ ఉద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మే డే కావడంతో ఉద్యోగులు ఎవరూ రాలేదు. దీంతో ఈ లీకేజీలతో పనులకు అవాంతరమేదీ ఏర్పడలేదు. అయినా చిన్నపాటి వర్షానికే ఇలాంటి లీకేజీలు ఏర్పడుతుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: