ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఫెడరల్ ఫ్రంట్ అంశంపై చర్చలు జరిపేందుకు ఆయన వచ్చారు. దేశంలో గుణాత్మక మార్పే తన ధ్యేయమంటూ బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు.
Former UP CM Akhilesh reaches Hyderabad
దేశ రాజకీయాలపై వారి మధ్య చర్చలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం కేసీఆర్ తో కలిసి అఖిలేష్ భోజనం చేసిన తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో తేనేటి విందులో పాల్గొననున్నారు.  ఇప్పటికే తెలంగాణ సీఎం ఫెడరల్ ప్రంట్ కోసం ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చించారు. ఆ తర్వాత వరుసగా జాతీయస్థాయిలో కీలకంగా ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుస్తున్నారు. 

ఈ నేపథ్యంలో బెంగళూరు వెళ్లి జేడీఎస్ నేతలు దేవేగౌడ, కుమారస్వామిలను కలిశారు. ఇటీవల చెన్నైలో కరుణానిధి, స్టాలిన్, కనిమొళిలతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.  ఇందులో భాగంగా నేడు  అఖిలేష్ హైదరాబాద్ వచ్చారు. ఆయనకు మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లో విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.


మరింత సమాచారం తెలుసుకోండి: