ప్రస్తుత రాజకీయాల్లో కలవకుంట్ల చంద్రశేఖర రావుది ఒక విలక్షణ శైలి. ఆయన ఒక మాయల మాంత్రికుడు. అన్నీ వరాలు వగ్ధానాలు మాటల్లో ఇచ్ చేస్తాడు. అంతా ఇవ్చ్చినట్లే ఉంటుంది. ఏమైనా విదిలిస్తే కిందైనా పడిందా అని చూస్తే ఒళ్ళు నలిపిన పడేసిన మట్తికూడా దొరకదు.

అయితే సచివాలయానికి కూడా వెళ్లని ఈ తెలంగాణా మహానేత “దేశంలో గుణాత్మక పాలన తీసుకు రావటానికి ఫెడరల్ ఫ్రంటును ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహిస్తాడట. అది బిజెపి యేతర కాంగ్రెస్ యేతర ఫ్రంట్ అట. కారణం తాజాగా తనకు బిజేపితో వైరం, తనను కాంగ్రెస్ నమ్మే ప్రశక్తి లేదు. ఈయన కాంగ్రెస్ కు చేసిన ద్రోహం దాని చరిత్రలోనే ఎవరూ చేసి ఉండరు”  ఇప్పుడు తనకుమారుణ్ని ముఖ్యమంత్రి చేయటం ఆయన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులోని ప్రధానా ఎజెండా అదేనట.
akhilesh yadav met kcr in pragati bhavan కోసం చిత్ర ఫలితం
అందుకే నిన్నమొన్నటి వరకు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశ ద్రిమ్మరిలాగా పలు రాష్ట్రాలు పట్టుకుని తిరిగారు. కానీ ఇప్పుడు దృశ్యం మార్చేశారు. ఈక కేసిఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కద బిజెపి, కాంగ్రెస్ వ్యతిరెఖులను కలవటం కాదు కేసిఆర్ నే వారు హైదరాబాద్ వచ్చి కలిసే కార్యక్రమం ప్రారంభించారు. ఆ క్రమంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లక్నో నుంచి రెక్కలు కట్టుకుని వచ్చి హైదరాబాద్ లో వాలిపోయాడు.  ప్రగతి భవన్ లో తెలంగాణ సిఎం కేసిఆర్ తో అఖిలేష్ భేటీ అవుతున్నారు. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో కేసిఆర్ ప్రతిష్టను పెంచే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చలు కూడా ప్రారంభమయ్యాయి ప్రగతి భవన్ వెలుపల. 
akhilesh yadav met kcr in pragati bhavan కోసం చిత్ర ఫలితం
బుధవారం ఉదయం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ రాగా, ఆయనను సిఎం తనయుడు, ఐటి శాఖ మంత్రి కేటిఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేట ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికారు. అనంతరం అఖిలేష్ ను ప్రగతి భవన్ కు తీసుకుపోయారు. ప్రగతి భవన్ లో మధ్యాహ్నం అఖిలేష్ కు కేసిఆర్ విందు ఇచ్చారు.  విందు తర్వాత ఫెడరల్ ఫ్రంట్ పైనా, తాజా రాజకీయ పరిణామాలపైనా ఇద్దరు నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత ఈరోజు సాయంత్రం అఖిలేష్ లక్నో వెళ్లిపోయే అవకాశముందని తెలుస్తుంది. 
సంబంధిత చిత్రం
ఫెడరల్ ప్రంట్ ప్రకటన చేసిన తర్వాత సిఎం కేసిఆర్ తొలుత కోల్ కతా వెళ్లి పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీతో భేటీఅయ్యారు. తర్వాత బెంగూళూరు వెళ్లి దేవెగౌడ, కుమారస్వామితో భేటీ అయ్యారు. అనంతరం చెన్నైవెళ్లి అక్కడ డిఎంకె అధినేత కరుణానిధితో భేటీఅయ్యారు. తర్వాత ఆ పార్టీ నేత స్టాలిన్ ను కలుసు కున్నారు. డిఎంకె ఎంపి, కరుణానిధి కుమార్తె కనిమొళిని కూడా కలిశారు. మధ్యలో జార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరేన్ ఒకసారి హైదరాబాద్ వచ్చి కేసిఆర్ ను కలిసి పోయారు. 
సంబంధిత చిత్రం
ఇప్పుడు దృశ్యం తిరగబడింది. దేశంలోనే అతి పెద్దరాష్ట్రానికి సిఎంగా పనిచేసిన అఖిలేష్ యాదవ్ స్వయంగా వచ్చి కేసిఆర్ ను కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశ మైంది.అయితే ఇటీవల కేసిఆర్ తనయుడు, మంత్రి కేటిఆర్ ముందుగా వెళ్లి అఖిలేష్ ను కలిశారు. ఆ తర్వాత తాను కలిసిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు. అయితే ఆ సమయంలోనే హైదరాబాద్ వచ్చి కేసిఆర్ ను కలవాల్సిందిగా కేటిఆర్ సాదర ఆహ్వానాన్ని అందించారని   చెబుతున్నారు. 
akhilesh yadav met kcr in pragati bhavan కోసం చిత్ర ఫలితం
జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిన్చేందుకు ఉవ్విళూరుతున్న అఖిలేష్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునే ఉద్దేశంతోనే కేటిఆర్ ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్ వస్తానని వెల్లడించారు. ఆమేరకు బుధవారం ఆయన హైదరాబాద్ వచ్చి కేసిఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ సిఎం చేస్తున్న ప్రయత్నాల్లో ఎంతో కొంత అంతటా వ్యతిరేఖంగా ఉన్నా, ఈ పరిణామం తమకు కలిసివస్తుందన్న ఆశతో ఉన్నారు గులాబీ నేతలు. ఎందుకంటే మాజీ సిఎం అఖిలేష్ స్వయంగా హైదరాబాద్ వచ్చి కేసిఆర్ ను కలవడం, అది కూడా ఒక పెద్ద రాష్ట్రం నుంచి ప్రతినిధి రావడం తమకు కలిసొస్తుందని చెబుతున్నారు. మరి అఖిలేష్ ఇచ్చే న సందేశం మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. 
akhilesh yadav met kcr in pragati bhavan కోసం చిత్ర ఫలితం
దేశంలో “గుణాత్మక మార్పు” (దానికి ఇప్పటివరకు సరైన నిర్వచనం ఇవ్వలేదు ప్రస్తుతానికి అదో బ్రహ్మ పదార్ధం)  తీసుకురావడం కోసం సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా వివిధ పార్టీల నేతలతో భేటీ అవుతున్నారు. ఈనేపథ్యంలో కేసీఆర్, అఖిలేశ్ భేటీలో “కొత్త రాజకీయ కూటమి” పై చర్చించారు. 
సంబంధిత చిత్రం
అనంతరం ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడిన కేసిఆర్  దేశంలో పరివర్తన, గుణాత్మక మార్పు రావాలని, దాని కోసం జాతీయ రాజకీయాల్లో క్రియాశీలపాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్నానన్నారు. అఖిలేశ్ తో గత నెల రోజులుగా చాలా సార్లు మాట్లాడాన ని స్పష్టం చేశారు. ఇది రాజకీయ పార్టీల కూటమి కాదని ఏళ్లు గడిచిపోయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయలేదన్నారు. దేశంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. దేశ రాజకీయాల్లో పరివర్తన రావాల్సిన అవసరం ఉందని, ఆ మార్పు కోసమే తాము తాజాగ్ప్రయత్నం చేస్తున్నామన్నారు. దానిపై అఖిలేశ్‌ తో అన్ని విషయాలను మాట్లాడానని కేసీఆర్ స్పష్టం చేశారు.
akhilesh yadav met kcr in pragati bhavan కోసం చిత్ర ఫలితం
అయితే అఖిలేష్ ప్రాంతీయ పార్టీలు కలిసి వస్తేనే బీజేపీని నిలువరించగలమని అఖిలేశ్ తెలిపారు. బీజేపీ ప్రజలను నిరాశపరిచింది. బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. అందుకే దేశానికి ఒక మార్గదర్శి దిశ నిర్దేశం కావాలి. ఇతర దేశాలతో పోల్చినప్పుడు మనం ఆశించినంత అభివృద్ధి చెందలేదు. కేసీఆర్ పాలన, సంక్షేమ పథకాలు బాగున్నాయి. ప్రజా సంక్షేమం కోసం ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇదొక మంచి ప్రయత్నం. సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నానికి మా సంపూర్ణ మద్దతుఎప్పుడూ కొనసాగుతుందని అన్నారు. హైదరాబాద్‌ తో మాకు ఎప్పటి నుంచో సత్సంబంధా లున్నాయి. యూపీ లో సీఎం, డిప్యూటీ సీఎం లను వారి  నియోజకవర్గాల్లోనే ఓడించి మార్పుకు శ్రీకారం చుట్టామని అఖిలేశ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: