భారతదేశం చట్టబద్ధంగా మరియు సంప్రదాయబద్ధంగా మతపరమైన భిన్నత్వం మరియు మత సహనం నెలకొల్పబడిన దేశం. అదే విధంగా అన్ని మతాల మూల సూత్రము ఒకటే. అందుకే మతాలలో ఇన్ని విధాలున్నాయి. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, అందరికీ దేవుడు ఒక్కడేనని అంటారు. మనదేశంలో నాయకులు కులాల మధ్య.. మతాల మధ్య ఎంతగా చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నా మన మతసామరస్యం ముందు వాళ్ళ పప్పులు ఉడకడం లేదు..! భారతీయులంటే మతసామరస్యం అని తెలియజేసే సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. 

మత సామరస్యాన్ని వినూత్న రీతిలో చాటిన ఉత్తరప్రదేశ్‌లోని ఓ ముస్లిం కుటుంబం పట్ల సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. సుల్తానాపూర్‌లోని బాగ్‌సరి గ్రామానికి చెందిన జహానా బానో అనే ముస్లిం అమ్మాయికి ఇటీవల పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయి తండ్రి మహ్మద్ సలీం పెళ్లికార్డులో సీతారాముల చిత్రాలను అచ్చువేయించి, వాటిని హిందూ మతానికి చెందిన తమ మిత్రులకు పంచాడు. అక్కడితో ఆగలేదు మొహమ్మద్ సలీం.. శుభలేఖతో పాటు కలశం, దీపాలు, అరటి ఆకులు, పూలు వంటి వస్తువులను కూడా పంచాడు.

మతసామరస్యాన్ని పెంచుతూ మహ్మద్ సలీ చేసిన పని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. ఏది ఏమైనా సలీం లాంటి వాళ్ళ వల్ల మతసామరస్యం అనేది పెంపొందుతోంది. అందుకే భారత దేశం అన్ని మతాల వారు ఒకే ప్రాంతంలో ఉండి కలిసి మెలిసి జీవిస్తున్నారు.  అప్పుడప్పుడు కొంత మంది స్వార్ధపరులు..రాజకీయ నాయకులు పెట్టే చిచ్చు వల్ల మతకల్లోలాలు చెలరేగుతుంటాయి. ఇక మతసామరస్యాన్ని పెంచుతూ మహ్మద్ సలీ చేసిన పని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: