ఆడవారి మాటలకు అర్ధాలువేరులే అన్నమాటలను ప్రక్కన పెట్టి రాజకీయనాయకుల మాటలకు అర్ధాలు వేరులే అని పాడుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వీళ్ళ దౌర్భ్యాలకు దుష్కృత్యాలకు తోడు వారి వారి స్వంత మీడియాలు కుల మీడియాలు అగ్నికి ఆజ్యంపోస్తూ వాళ్ల మద్య అవకాశవాదాన్ని అగ్గిలాగా రాజెస్తున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చన్నది నూరుశాతం నిజం.    
modi appreciation to deve gowda కోసం చిత్ర ఫలితం
తాజాగా బీజేపీ తరఫున కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ పై ప్రశంసల జడివాన కురిపించారు. దేవెగౌడ అంటే తనకెంతో గౌరవమని వ్యాఖ్యానించిన నరెంద్ర మోదీ, ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఎదురెళ్లి మరీస్వాగతం పలుకుతానని అన్నారు. దీంతో నరెంద్ర మోదీ వ్యాఖ్యలు రాజకీయవాదులకు రాజకీయ చర్చనీయాంశంగా మారాయి.
modi appreciation to deve gowda కోసం చిత్ర ఫలితం
నరెంద్ర మోడీ పొగడ్తలకు స్పందించిన దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ, "మోదీ పొగడడం తో తమకి, బీజేపీకి 'పొత్తు' ఉంటుందని అర్థం చేసుకోవద్దని చెప్పారు. కన్నడ ప్రజల గౌరవాన్ని సిద్ధరామయ్య ఏ విధంగా దిగజార్చుతున్నారో చెబుతూ, ఒక కన్నడ వ్యక్తి ప్రధాని అయ్యారని నరెంద్ర మోదీ గుర్తు చేశారని, అంత మాత్రన దాని అర్థం 'పొత్తు' ఉంటుందని కాదు" అని పేర్కొని ప్రజలకు వేరే సందేశం అందించారు. 
modi appreciation to deve gowda కోసం చిత్ర ఫలితం
అలాగే, ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనపై చేసిన వ్యాఖ్యలపై కూడా దేవెగౌడ స్పందించారు. తాను కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్నానంటూ సిద్ధరామయ్య ఆరోపణలు చేశారని  మరి ఇప్పుడు సిద్ధరామయ్య తనయుడు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కదా? అని నిలదీశారు. దానికి సిద్ధరామయ్య సమాధానం చెప్పాలని ఆయన నిగ్గదీశారు. చేప్పేటందుకె నీతులు ఉంటాయని తనదగ్గరికి వచ్చేసరికి అన్నీ మారి అందరూ అంతే అనేలా ఉంటాయని మనం అర్ధం చేసుకోవాలి.  

modi appreciation to deve gowda కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: