ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదంటూ ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని కామెంట్స్ చేసారు. మరోపక్క ప్రతిపక్షనేత జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ముందునుండి ఒకే మాట మీద నిలబడటంతో రాష్ట్రం లోని ప్రజలందరూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి జరుగుతుందని బలంగా నమ్మరు.
Related image
దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ప్రత్యేకహోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని...యు టర్న్ తీసుకొని మాట్లాడారు. దీంతో చంద్రబాబు చేసిన రాజకీయానికి రాష్ట్రంలో రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా నవ్వుతున్నారు. అయితే మరోపక్క ప్రతిపక్ష నేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర తో రాష్ట్ర రాజకీయాలలో అనేక సంచలనాలు సృష్టిస్తూ రాజకీయ సమీకరణాలు మారుస్తూ ప్రజల ఆదరాభిమానాలను దోచుకుంటూ ముందుకెళుతున్న నేపద్యంలో...అధికార పార్టీ తెలుగుదేశం నాయకులకు చంద్రబాబుకి వెన్నులో వణుకు పుట్టింది.
Related image
దీంతో చంద్రబాబు ధర్మపోరాటం దీక్షలు అంటూ పలుచోట్ల దీక్షలు నిర్వహించారు...తాజాగా చంద్రబాబు మరియు తెలుగుదేశం నాయకులు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల సాధనే లక్ష్యంగా అన్ని జిల్లాల్లో ధర్మపోరాట సభలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.
Related image
అమరావతిలో మంత్రులు, పార్టీ ప్రధానకార్యదర్శులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో అన్ని జిల్లాల్లో ధర్మపోరాట సభలు…జనవరి వరకు కొనసాగుతాయన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: