జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఎదుగుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు బట్టి జాతీయ రాజకీయాల్లో మార్పు రావాలంటే జాతీయ పార్టీలుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ బిజెపి పార్టీలు అధికారంలోకి  రాకుండా మరొక కూటమి ఏర్పడాలని కెసిఆర్ తన ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Related image
ఈ క్రమంలో దేశంలో ప్రముఖ రాజకీయ నాయకులను కలిసి చర్చిస్తున్నారు. తాజాగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రగతి భవన్ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. తర్వాత అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రజలు కాంగ్రెస్ బీజేపీ పార్టీల వల్ల ఎంతో నష్టపోయారు అలాగే విసిగిపోయారని తెలియజేశారు.
Image result for kcr akhilesh yadav
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి దేశం ముక్కలయ్యే పరిస్థితి కనబడుతోంది ఈ క్రమంలో మనమే చొరవ తీసుకుని దేశాన్ని కాపాడాలని కొత్త కూటమి ఏర్పాటుకు కొందరు నాయకులు సహకరించాలని కోరారు అఖిలేష్ యాదవ్. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఒక తాటి పైకి రావాలని అన్నారు.
Related image
అలాగే కేసీఆర్ పరిపాలన చాలా బాగుందని ఆయన చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు చేరవలసిన సామాన్యునికి చేరుతున్నాయని కెసిఆర్ పాలనన్ను అభినందించారు. అంతేకాకుండా సీఎం కేసిఆర్ చేస్తున్న ఈ ప్రయత్నానికి మా మద్దతు పూర్తిగా ఎప్పుడూ నిరంతరం ఉంటుందని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: