ఈ మద్య టెక్నాలజీ ని కొంత మంది తమ అక్రమ దందాలకు ఉపయోగిస్తూ అమాయకులను మోసం చేయడం..బురిటీ కొట్టించడం జరుగుతుంది. ముఖ్యంగా  ఫోటోలు, వీడియోలు మార్పింగ్ చేసి నానా బీభత్సం సృస్టిస్తున్నారు.   సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మార్ఫింగ్ బెదిరింపులకు బలి అవుతూనే ఉన్నారు.  కొంత మంది సైబర్ నేరగాళ్లు ఈ మార్ఫింగ్ మాయాజాలంతో సెలబ్రెటీలను బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. నకిలీ ఫోటోలతో.. మార్ఫింగ్ ఫోటోలతో మహిళల్ని వేధించటం చూస్తూనే ఉన్నాం. 
Image result for cyber crime
సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం మీద అసభ్యకర వ్యాఖ్యలు.. ఇబ్బంది పెట్టే వీడియోల్ని తయారు చేయటం.. వాటిని డిలీట్ చేయాలంటూ తమకు పెద్ద మొత్తం కావాలంటూ చేస్తున్న బ్లాక్ మెయిల్ ఉదంతం ఒకటి తాజాగా బయటకు వచ్చింది.  తాజాగా కూకల్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై అభ్యంతరకర రీతిలో పోస్టుల పెడుతు ఓ కుర్రాడు బ్లాక్ మెయిల్ చేయడం ఆరంభించాడు. దాంతో మొదట ఆ యువకుడికి మంచి మాటలతో చెప్పినప్పటికీ అతని చర్యలు విపరీతం కావడంతో..మరింత రెచ్చిపోయాడు.
Image result for cyber crime
తాను ఆ పోస్టులు పెట్టకుండా ఉండాలంటే..తనకు రూ.10లక్షలు ఇస్తే పోస్టులు పెట్టటం మానేస్తాని చెప్పటంతో ఎమ్మెల్యే వర్గీయులు షాక్ తిన్నారు.ఎమ్మెల్యే సూచనతో పోలీసులకు ఈ అంశంపై సమాచారం అందించారు. కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.  కాగా, వచ్చే ఎన్నికల్లో కొంత మంది నేతల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ఇలాంటి దందాలకు పాల్పపడుతున్నట్లు..ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసుకుల సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: