గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠినచర్యలకు ఆదేశించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టిచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ మద్య భారత దేశంలో మహిళలపై, వృద్దులపై, చిన్నారులపై లైంగాక దాడులు, అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో మహిళలకు ఎంతో గౌరవం ఇస్తున్నామని మొదటి నుంచి చెబుతూ వస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో వెంటనే స్పందించారు. అంతే కాదు సీరియస్ యాక్షన్ కి ఆదేశించారు. 

దాచేపల్లికి వెళ్లాలని జిల్లా మంత్రులు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ ను ఈ మేరకు ఆదేశించారు. కాగా, నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు దాచేపల్లిలో ఆందోళనకు దిగారు. స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు.నిన్న అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకూ అద్దంకి - నార్కట్ పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.
Image result for chandrababu serious
బాలికకు వైద్య చికిత్స నిమిత్తం గుంటూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పరామర్శించారు. బాలిక ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

బాధితురాలికి మెరుగైన వైద్య సేవలందించాలని కోన శశిధర్ ఆదేశించారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆసిఫా హత్యాచార ఘటన మరువక ముందే దాచేపల్లిలో మరో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని 9 ఏళ్ల బాలికపై సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారానికి తెగబడ్డాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: