ఈ మాటలు అంటుంది..అధికార పక్షానికి చెందిన నాయకులు అనుకుంటే పొరపాటే..సాధారణంగా ప్రతిపక్ష నేతలను అధికార పక్షంలో ఉన్న నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు..రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. కానీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసలు రాజకీయ నాయకుడు కాదని అంటున్నారు అమెరికాకు చెందిన ఓ మహిళ.  అసలు విషయానికి వస్తే..ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది ముసుగులో చేస్తున్న అన్యాయాలు, అక్రమాల గురించి ప్రశ్నిస్తూ..ప్రజలను చైతన్య పర్చడానికి తన తండ్రి మార్గాన్ని ఎంచుకున్నారు వైఎస్ జగన్. 

‘ప్రజా సంకల్ప యాత్ర’ చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు.   కాగా, ఇటీవ‌ల కాలంలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో ప్ర‌జాదార‌ణ చూర‌గొంటూ.. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గాన్వేష‌ణ చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను అమెరికాకు చెందిన మ‌హిళ త‌న కుటుంబ స‌మేతంగా క‌లిసింది. జ‌గ‌న్‌ను క‌లిసి త‌రువాత జ‌గ‌న్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను మీడియాతో పంచుకుంది మెలోడీ. వైఎస్ జగన్ పై మోలోడీ ఏమన్నారో..ఆమె మాటల్లోనే...నేను జ‌గ‌న్ గారిని ఒక రాజ‌కీయ నాయ‌కుడిఆలా చూడ‌టం లేదు. రాజ‌కీయ నాయ‌కుల ఓట్ల గురించి ఎన్నో మాట‌లు చెప్పుతారు.


ఎలక్షన్ టైమ్ లో ఒక్కసారి ముఖం చూపించి తర్వాత ప్రజలను పట్టించుకోకుండా వారి పనులు వారే చేసుకునే నాయకులను ఎంతో మందిని చూశాను. వారు ఇచ్చిన మాట మీద నిలబడరు. కానీ.. జ‌గ‌న్ విషయంలో నాకు అలాంటిది ఎక్కడా కనిపించలేదని..రాజ‌కీయాల్లో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిజాయితీగా ముందుకు వెళ్లాల‌ని డిసైడ్ అయ్యారు. పాద‌యాత్ర‌లో ఎంతోమందిని క‌లుస్తున్నారు.

కాని ఎక్క‌డా విసుగు చెందిన‌ట్లు క‌న‌బ‌డ‌రు. ప్ర‌జ‌లు అత‌ని మీద ప‌డుతున్నా.. అత‌నితో ఫోటోలు తీసుకోవ‌టానికి పోటీ ప‌డుతున్నా ఎవ‌రినీ కాదనకుండా..ప్రశాంతమైన చిరునవ్వు చిందించడం నిజంగా ప్రశంసనీయం అన్నారు. కొన్ని  సంద‌ర్బాల్లో అత‌నే సెల్ఫీ తీసి ఇస్తారు. అంద‌రిని ఎంతో సంతోషంగా క‌లుస్తున్నారు. ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తున్నారు.

ఇదంతా అత‌ను ప్ర‌చారం కొర‌కు చేయ‌టం లేదు. ప్ర‌జ‌ల కొర‌కే అని స్ప‌ష్టం అవుతుంది. నేను నా ఇద్దరు ఆడపిల్లలతో జగన్ ని కలవడానికి వెళ్లాను..ఆ సమయంలో బాగా తోపులాట జరిగింది.  నా చిన్న కూతురు ఒక్కసారిగా ఏడవడం మొదలు పెట్టడంతో..స్వయంగా జగన్ నా కూతురు ని ఎత్తుకొని ఓదార్చారు..ఏడుపు ఆపే వరకు ముద్దు చేశారని అన్నారు మోలోడి.  జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో ఎన్ని విమర్శలు వస్తున్నా..ఆయన మాత్రం ప్రజలతో మమేకం అవుతూ రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజా నాయకుడిగా ముందుకు సాగుతున్నారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: