దేశంలో ఈ మద్య మహిళలపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి.  ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా..కొంత మంది దుర్మార్గులు చేసే పనుల వల్ల ఎంతో మంది మహిళలు బలిఅవుతున్నారు.  తాజాగా తన భార్యకు బతికే అర్హత లేదంటూ సజీవదహనం చేసిన మృగాడు విరాజ్... ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే..జీతూ(29) తన భర్త విరాజ్‌ నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ కేసు పెండింగ్ లో ఉండగా ఆమె భర్త జీతూ పై కక్ష్య పెంచుకున్నాడు. 
Image result for jeethu murder case
లోన్‌ పని నిమిత్తం ఆమె తన తండ్రితో కలిసి చెంగళూరులోని కుదుంబశ్రీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అధికారులతో మాట్లాడుతున్న సమయంలో భర్త విరాజ్‌ ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. పెట్రోల్‌ పోయటంతో ఆమో తన ప్రాణాలు కాపాడాలని పరిగెత్తింది. జీతూ తండ్రి తన కూతురిని కాపాడాలంటూ అక్కడున్న వారందరి కాళ్ల వేళ్ల పడ్డారు. కానీ, ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. ఘటన తర్వాత విరాజ్‌ అక్కడి నుంచి పారిపోగా.. తీవ్ర గాయాలపాలైన జీతూను ఆస్పత్రికి తరలించేందుకు తండ్రి అక్కడున్న వారి సాయం కోరారు.
Husband Set Ablaze Wife in Kerala Thrissur - Sakshi
కాళ్లా వేళ్లా పడ్డ ఎవరూ కనికరం చూపలేదు. చివరకు ఓ ఆటోడ్రైవర్‌ సాయంతో జీతూ తండ్రి ఆమె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జీతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. అయితే టీవీల్లో వస్తున్న వార్తల ద్వారా విరాజ్ ఘాతుకం గురించి ముంబైలోని కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారు అతడిని తమ వద్దే ఉంచి స్వయంగా పోలీసులకు సమాచారం అందించారు. పుదుక్కాడ్ ఎస్ఐ నేతృత్వంలోని ప్రత్యేక బృందం హుటాహుటిన ముంబై వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: