శాసన సభ ఎన్నికల తరవాత కర్ణాటకలో ఎవరి ప్రతాపం ఎవరెవరి సామర్ధ్యం ఏమిటో 15వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాలతో తేలిపోతుందని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. కర్ణాటక నుంచే బీజేపీ పతనం ప్రారంభం కాబోతోందని చెప్పారు. 2019ఎన్నికల తర్వాత మన దేశంలో నేటి ప్రధాని నరెంద్ర మోదీకి పనేమీ  ఉండదని, ఆపై కర్ణాటకకు వచ్చేస్తే మావాళ్లు కూర్చోబెట్టి "కన్నడ భాష" నేర్పిస్తారని చాలా పరుషంగానే అన్నారు.
prakash raj attack on modi & shah కోసం చిత్ర ఫలితం
కర్ణాటక ప్రచారంలో నరెంద్ర మోదీ కన్నడ ప్రసంగాన్ని అవహేళన చేస్తూ, ప్రకాష్ రాజ్ ఇలా వ్యాఖ్యానించారు. సింధనూరు లో దళిత, ప్రగతి పర సంఘాలు ఏర్పాటు చేసిన "ప్రజాస్వామ్య రక్షణ కోసం" అనే కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరెంద్ర మోదీ కన్నడం లో మాట్లాడిన ప్రసంగాన్ని అనుకరించి చూపారు. కూరగాయలు అమ్మినట్టు ఏమిటండీ ఈ భాష! అంటూ ఎద్దేవా చేశారు.
prakash raj attack on modi & shah కోసం చిత్ర ఫలితం
మరోవైపు రాహుల్ గాంధీ ప్రసంగాలను తప్పుబడుతున్న నరెంద్ర మోదీని ఉద్దేశించి, రాహుల్ గాంధి వయసెంత? మీ వయసెంత? సిగ్గుగా లేదా? అని అన్నారు. తాను ఏ పార్టీ చెందిన వ్యక్తిని కాదని, తనకు బీజేపీ అంటే భయం లేదని చెప్పారు.


వేరే సందర్భంలో తను మోడీకి అమిత్ షాకి వ్యతిరేఖం కాని హిందువులకు మాత్రం కాదని అన్నారు. "మతంపేరుతో ఓటర్లను విడగొట్టడం ద్వారా బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధిక్కరించడమే కాకుండా సమాజాన్ని నిలువునా చీలుస్తోంది, అందుకే కర్నాటకలో బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తన తక్షణ కర్తవ్యం" అని నేషనల్‌ మీడియా ఎదుట తన రాజకీయ ఎజెండాని స్పష్టం చేశారు ప్రకాష్‌రాజ్‌. తొలినుంచి కాంగ్రెస్, బిజెపిలకు తాను వ్యతిరేకమేనని, అయితే ఓటు ఎవరికి వేయాలో నేను చెప్పను. కానీ మతోన్మాదులను అధికారంలోకి రానివ్వద్దని మాత్రం చెపుతానని తాజాగా ప్రకటించారు. 
సంబంధిత చిత్రం
కర్నాటక ఎన్నికల అనంతరం   బిజెపితో జతకట్టే ప్రస్తకేలేదని జెడిఎస్‌ తనకు హామీయిచ్చినట్టు ప్రకాష్‌రాజ్‌ ప్రకటించారు. ఇంతదాకా మాట్లాడనందుకు సిగ్గుపడు తున్నాను. సరిగ్గా ఒక ఏడాది క్రితం వరకు ప్రాంతాలకు అతీతంగా తన నటనతో వివిధ రాష్ట్రాల ప్రజలను ఉర్రూతలూగించిన ప్రకాష్‌ రాజ్‌ ప్రముఖ కన్నడ జర్నలిస్టు గౌరీలంకేశ్‌ హత్య తరువాత కాషాయీకరణ రాజకీయాలను ధిక్కరిస్తూ బహిరంగంగా ముందుకొచ్చారు. 
prakash raj attack on modi & shah కోసం చిత్ర ఫలితం
ఇప్పుడే ఎందుకని ముందుకొచ్చారని ప్రశ్నించిన మీడియాకి ఇక ఇప్పుడు సైతం మాట్లాడకపోతే మానవత్వం బతికుండదని కుండబద్దలు కొట్టారు. "చావు నా యింటి గడప ముందు కొచ్చినా మాట్లాడకపోవడం సిగ్గుచేటు, యింతకాలం మాట్లాడనందుకు సైతం సిగ్గుపడతున్నాను" అని పశ్చాత్తాప పడిన సందర్భం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదలించింది. ప్రకాష్‌రాజ్‌ సోషల్‌ మీడియాకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గుక్కతిప్పుకోకుండా భారతీయ జనతాపార్టీపైనా, ఆ పార్టీ నాయకుల పైనా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
 prakash raj attack on modi & shah కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: