చాలా మంది ఒకరిని ఇరికించబోయి వారే ఇరుక్కోవడం మనం చూసే ఉంటాము. ఇప్పుడు అచ్చం టిడిపి మంత్రి కూడా జగన్ మీద విమర్శలు చేయబోయి ఏకంగా తమ పార్టీ అధినేత నే ఇరికించినట్లైంది. టీడీపీ  మంత్రి దేవినేని ఉమా జగన్ కు సవాలు విసిరినాడు. కర్నాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలని అక్కడి ప్రజలకు పిలుపు ఇవ్వగలరా?  అని ఉమా జగన్ కు సవాలు విసిరాడు.ఈ సవాలు ద్వారా.. దీనికి అనుకూలంగా స్పందించకపోయినట్లయితే.. వైఎస్ జగన్- భాజపాతో కుమ్మక్కు అయినట్లే అని చాటడానికి ఆయన ఉద్యుక్తులు అవుతున్నారు.

Image result for devineni uma

అయితే ఇందులో తమాషా ఏంటంటే.. ఉమా సవాలు అసలు జగన్ ఉద్దేశించి చేసినదా? లేదా, చంద్రబాబునాయుడును ఉద్దేశించి చేసినదా? అనే చర్చ పలువురిలో జరుగుతోంది. ఎందుకంటే.. ఇప్పటిదాకా చంద్రబాబునాయుడు కూడా కర్నాటక ప్రజలను ఉద్దేశించి అంత స్పష్టంగా పిలుపు ఇవ్వలేదు. అందుకు ఆయన ధైర్యం చేయడం లేదు. మరి తమ పార్టీ అధినేతే చేయలేని పనిని గురించి, ఉమా, ప్రతిపక్ష పార్టీ అధినేతకు సవాలు విసరడం ఏమిటో అర్థం కావడం లేదు.

Image result for devineni uma

ఇంట గెలిచి రచ్చ గెలవాలని సామెత. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇంట గెలిచే ప్రయత్నంలోనే ఉన్నారు. తన పార్టీ ఉన్న రాష్ట్రంలో తన సత్తా, బలం ఏమిటో నిరూపించుకోకుండా..  పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఎన్నికలను ప్రభావితం చేయాలనుకుంటే విలువ ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: