జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ పరోక్షంగా ఒకటైనట్లు తెలుస్తోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై వాళ్ల కుటుంబం పై ఒక కుట్ర పరంగా ప్రచురించిన కథనాలపై పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అనేకమంది పెద్దలతో హీరోలతో కలిసి ఒక వర్గానికి కొమ్ముకాసే మీడియాని కట్టించడానికి సమావేశాలు నిర్వహించడం జరిగింది.
Image result for pawan kalyan jagan
అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని న్యాయపోరాటం పరిధిలో ఎదుర్కొనడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏ మీడియా అయితే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి ఆయనను వ్యక్తిగతంగా దెబ్బ కొట్టాలనుకుందో...అదే మీడియా వైసీపీ అధినేత జగన్ ని మొదటి నుండి టార్గెట్ చేస్తూ...ఇప్పటికీ ఆయన వ్యక్తిగత విషయాలపై రాజకీయ జీవితంపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తూనే ఉంది.
Related image
ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ పోరాటానికి వైసిపి అధినేత జగన్ పరోక్షంగా అండగా ఉండడానికి సిద్ధపడ్డారు. పవన్ పార్టీలోని ముఖ్య నేతలు కొందరు జగన్ పార్టీకి సేవలందిస్తున్న న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు.
Image result for pawan kalyan jagan
భవిష్యత్తులో పచ్చ మీడియాను ఏవిధంగా ఎదుర్కోవాలో ఈ సమావేశంలో చర్చించుకున్నారని సమాచారం. తాజాగా జరిగిన సమావేశం తో  పవన్ కళ్యాణ్ వైసీపీ అభిమానుల మధ్య సామరస్య వాతావరణం నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: