అంతర్జాల విప్లవం తెచ్చిన “సామాజిక అనుసంధాన వేదిక - ఫేస్‌బుక్‌”  లో ప్రపంచంలో ఎక్కువ మంది అనుసరించే ప్రపంచ రాజకీయ నాయకుడిగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రికార్డ్ సృష్టించారు.  4.32 కోట్ల మంది మోడీని ఫేస్‌బుక్‌లో అనుసరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ 2.31 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 
modi no.1 in internet face book followers కోసం చిత్ర ఫలితం
ఫేస్‌బుక్‌ లో ప్రపంచ నాయకులు పేరిట “బర్సన్‌ కోన్‌ అండ్‌ వోల్ఫ్‌ - బీసీడబ్ల్యూ” సంస్థ ఈ జాబితా విడుదల చేసింది. 650 మంది ప్రపంచ దేశాధిపతులు, ప్రభుత్వాల  అధినేతలు, విదేశాంగ మంత్రులకు చెందిన “ఫేస్‌బుక్‌ పేజీ” లను ఈ సంస్థ విశ్లేషించింది. గత ఏఢాది జనవరి 1నుంచి సమాచారాన్ని విశ్లేషించింది.  2017లో ఎక్కువ మంది లైక్ చేసిన ఫోటోల్లో ఐదింటిని మోడీనే షేర్ చేశారు.  ఒడిశా లోని ప్రఖ్యాత లింగరాజ్ దేవాలయ సందర్శన సమయంలో మోడీ తీసుకున్న ఫోటో ఎక్కువ మంది మెచ్చిన ఫోటోగా రికార్డు సృష్టించింది. 
modi trump followers on face book కోసం చిత్ర ఫలితం
వ్యక్తిగత ఫేస్‌బుక్‌ లు 2018 మార్చి 15వ తేదీ నాటికి ఫేస్‌బుక్‌లో ప్రపంచనేతలను అనుసరించే వారి సంఖ్య 30.9 కోట్లుగా ఉంది. 2017 జనవరి 1 నుంచి మొత్తంగా 5లక్షల కు పైగా పోస్టులు చేశారు. వీటిపై 90కోట్ల సంభాషణలు జరిగాయి. 
modi trump followers on face book కోసం చిత్ర ఫలితం
ఐక్య రాజ్య సమితి దేశాల్లో 91శాతం దేశాలకు అధికారిక ఫేస్‌బుక్ పేజీలు ఉన్నాయి. దీనికి 109మంది దేశాధిపతులు, 86మంది ప్రభుత్వ అధినేతలు, 72 మంది విదేశాంగ మంత్రులకు వ్యక్తిగత ఫేస్‌బుక్ పేజీలు ఉన్నాయి. సంభాషణల్లో ట్రంప్ అధిక్యత సాధించ్చారు. గత పద్నాలుగు నెలల్లో ట్రంప్ ఫేస్ బుక్ పేజీ పైనే ఎక్కువ సంభాణలు చోటు చేసుకున్నాయి. ఆయన పేజీలో లైక్‌లు, వ్యాఖ్యలు, షేర్ల సంఖ్య 20కోట్లకు పైగా. 
modi status of followers uno official face book page కోసం చిత్ర ఫలితం

మోడీ పేజీ పైన 11కోట్లకు పైగా ఉంది అంటే ట్రంప్ కంటే దాదాపు రెండు రెట్లు ఫేస్‌బుక్ ఫాలోవర్లలో మోడీ ఉన్నారు. మోడీ ఫాలోవర్లు 43.2 మిలియన్లు అయితే, ట్రంప్ ఫాలోవర్లు 23.1 మిలియన్లు. సోషల్ మీడియాలో మోడీ చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే.

modi status of followers uno official face book page కోసం చిత్ర ఫలితం

According to a new study “World Leaders on Facebook”, with 43.2 million followers, PM Modi has emerged as the most popular world leader on Facebook.

మరింత సమాచారం తెలుసుకోండి: