ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అవుతున్నా..కేంద్రం ఇచ్చిన హామీ నేరవేర్చకుండా..కల్లబొల్లి మాటలు చెబుతూ వచ్చింది.  విభజన సమయంలో ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన యూపీఏ ప్రభుత్వానికి అప్పటి ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ మద్దతు పలికింది.  ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పాలన కొనసాగుతున్నా..ఏపికి ప్రత్యేక హోదా మాత్రం ఇవ్వకుండా జాప్యం చేస్తూ వచ్చింది. అంతే కాదు ఈ మద్య కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశంలో అసలు ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేదే లేదని చెప్పారు. 
Image result for ap special status
అప్పటికి వరకు ప్రత్యేక హోదా వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజులు దారుణంగా మోసపోయామని తెలుసుకొని ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అంటూ పోరాటానికి సిద్దం అయ్యారు.  ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా నినాదమే వినిపిస్తుంది. ప్రత్యేక హోదాకు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా మద్దతు పలికింది.  తాజాగా పీకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని నరేంద్ర మోదీపై ప్రముఖ సినీనటుడు నారాయణమూర్తి మండిపడ్డారు.   
Image result for modi
‘నరేంద్ర మోదీ గారూ! తెలుగువాడిగా మీకో విజ్ఞప్తి చేస్తున్నా .. దయచేసి, కర్ణాటకలో మా తెలుగువాళ్లను ఓటు అడిగే ముందు.. ఏపీకి మీరు ప్రకటించిన ప్రత్యేక హోదా ఇవ్వండి. మా తెలుగువాళ్లందరూ మీకే ఓటు వేస్తారు. ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకూ ఏ తెలుగువాడిని దయచేసి ఓటు అడగకండి! ప్లీజ్..ప్లీజ్ ఇంప్లిమెంటిట్. ‘హోదా’ను మీరు అమలు చేయండి..మీకు చేయెత్తి నమస్కరిస్తున్నాను’ అని అన్నారు.  ప్రస్తుతం ఏపి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో అన్ని పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: