గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై అత్యాచార ఘటనలో స్థానికులే కాదు..ఏపీ వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి.  నిందితుడు సుబ్బయ్య రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడని, ఇద్దరు భార్యలూ ఆయన్ని వదిలేశారని చెప్పారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... రామసుబ్బయ్య వ్యక్తిత్వం, అనుమానించే తత్వాన్ని భరించలేక ఆయన భార్య దాదాపు 20 ఏళ్ల కిందటే అతడిని వదిలి వెళ్లిపోయింది. దీంతో... అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా వివాహమైన ఏడాదిలోపే రామసుబ్బయ్యను వదిలి వెల్లింది.
Image result for దాచేపల్లి
సుబ్బయ్య 20 సంవత్సరాలుగా ఒంటరిగా బతుకుతున్నాడు. కూలి పనులు ముగిసిన తరువాత రామసుబ్బయ్య చిన్న పిల్లలను రిక్షా బండిపై దుకాణం వద్దకు తీసుకెళ్లి వారికి చాక్లెట్లు, బిస్కెట్లు కొనిపించేవాడు. బుధవారం కూడా ఇలాగే తొమ్మిదేళ్ల చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అత్యాచార ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన సుబ్బయ్యకు బుధవారం రాత్రి ఆయన బంధువులు ఫోన్‌ చేశారు.

‘ఇంత ఘోరానికి ఎందుకు పాల్పడ్డావు?’ అని ప్రశ్నించారు. దీంతో ‘నేను చచ్చిపోతున్నాను’ అని సుబ్బయ్య బదులిచ్చాడు. అయితే సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్లినట్టు తెలిసిందని, నిందితుడిని అరెస్ట్ చేసేందుకు 17 బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి.  ఇదిలా ఉంటే..దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. గురజాల మండలంలోని దైద అమరలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Image result for dachepally rapist protest
సంఘటన స్థలానికి పోలీసులకు చేరుకున్నారు. మృతుడు సుబ్బయ్యగా హోంమంత్రి చినరాజప్ప నిర్ధారించారు. సుబ్బయ్య ఎప్పుడు ఉరి వేసుకున్నాడనే విషయం వైద్యులు నిర్ధారిస్తారని చెప్పారు. ఇదిలా ఉండగా, బాధితురాలి బంధువులు, స్నేహితులు మాట్లాడుతూ, నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు కనుక సరిపోయిందని, బతికి ఉన్నట్టయితే తమ చేతుల్లో చచ్చిపోయేవాడని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: