సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ స్పష్టంగా రాజకీయాలలోకి వస్తాను అని చెప్పకుండా అనుసరిస్తున్న వ్యూహాలు మాత్రం భారీ రాజకీయ లక్ష్యాలతోనే ఉన్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రైతుల సమస్యలను కీలక అంశంగా తీసుకుని అడుగులు వేస్తున్న లక్ష్మీనారాయణ ఎత్తుగడలలో ఒక నిర్దిష్టమైన రాజకీయ వ్యూహం ఉంది అని లక్ష్మీనారాయణ ఈమధ్య వ్యవహరిస్తున్న తీరును నిశితంగా పరిసీలిస్తున్నవారు కామెంట్స్ చేస్తున్నారు. తన పోలీసు ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ తన రాజీనామా ఆమోదింపబడ్డ వెంటనే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. 
JD LAKSHMI NARAYANA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఎక్కడికక్కడ రైతులను కలుస్తూ వారి సమస్యల పై మాట్లాడుతున్న లక్ష్మీనారాయణ తీరును చూసిన వారికి రానున్న రోజులలో లక్ష్మీనారాయణ ఒక భారీ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించి తద్వారా మీడియాకు హాట్ టాపిక్ గా మారాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికితోడు లక్ష్మీనారాయణ ఎక్కడికెళ్లినా రాజకీయ సంబంధ అంశాలపై మీడియా అడుగుతున్న ప్రశ్నలకు ఎటువంటి తడబాటు లేకుండా ఒక పరిణితి చెందిన రాజకీయ వేత్తగా సమాధానాలు ఇస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కుంటున్న సమస్యలకు సరైన పరిష్కారం ఒక్క ప్రత్యేక హోదా మాత్రమే అంటూ ఈయన వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దగ్గరకు కావడానికి బ్రహ్మాస్త్రం లాంటి బర్నింగ్ టాపిక్ ఎంచుకున్నారు. 
సంబంధిత చిత్రం
అయితే రైతు సమస్యలకు పరిష్కారాలకోసం తాను అధ్యయనంలో ఉన్నాననీ రైతు సమస్యల పై ఒక నిర్ణయం తీసుకోవడానికి తనకు కొన్ని నెలల సమయం పడుతుంది అంటూ లక్ష్మీనారాయణ ప్రస్తుతానికి అన్ని రాజకీయ పార్టీలకు తాను అందరివాడినీ అన్న సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈమాజీ పోలీసుఅధికారి అనుసరిస్తున్న వ్యూహాలను చూసి చాలామంది రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మరో కేజ్రీవాల్ అవుతారా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ అవినీతి పై పోరాటం చేసి తన ‘ఆమ్ ఆద్మీ’ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చినట్లుగా లక్ష్మీనారాయణ రైతు ఉద్యమాల పై పోరాటం చేస్తూ రాబోతున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక కీలక శక్తిగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. 
సంబంధిత చిత్రం
అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అత్యంత ప్రజా ఆకర్షణ ధన బలం అనుభవం కలిగిన చంద్రబాబు జగన్ ల మధ్య మిసైల్ వార్ గా మారిన నేపధ్యంలో సినీ గ్లామర్ తో పవన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తన ముద్రను వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఈ ముగ్గురు ప్రముఖుల వ్యూహాల మధ్య లక్ష్మీనారాయణ నిలబడగలగుతారా ? లేదంటే లోక్ సత్తా పార్టీతో ఎదో మార్పులు తేవాలని ప్రయత్నించి పూర్తిగా విఫలం అయి ప్రస్తుతం టివి చర్చల కార్యక్రమాలకే పరిమితం అయిపోయిన జయప్రకాష్ నారాయణ్ లా మిగిలిపోతరా అన్న విషయం రానున్న కాలంలో తేలుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: