బాలికలు, మహిళలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోతోంది. మొన్న కథువా, నిన్న దాచేపల్లి, ఈ రోజు మరో బాలిక ఇలా మహిళలలు, చిన్నారు లను సైతం కామాంధులువు వదలడం లేదు.  ఇక మహిళలను రక్షించాల్సిన పోలీలు కూడా అత్యాచారాలకు తెగబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. తాజాగా అసోంలో మరో ఘోరం జరిగింది.  హజో పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న బినోద్ కుమార్ దాస్ పోలీస్ క్వార్టర్లో ఒక బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. రక్షించాల్సిన పోలీసులే ఇలాంటి దారుణానికి పాల్పడటంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారు.
Image result for హజో పోలీస్ స్టేషన్
కాగా, బినోద్ కుమార్ ను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఘటనపై అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ స్పందిస్తూ, దారుణానికి ఒడిగట్టిన పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఇప్పటికే భారత దేశంలో మహిళలపై, చిన్నారులపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Image result for rape images
ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఈ బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తుందని..కథువా లో జరిగిన దారుణం యావత్ భారత దేశాన్ని కలచి వేసిందని..మహిళలకు భద్రత కల్పించడం పోలీసుల పని అని... పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడటం తీవ్రమైన నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: