చంద్ర బాబు నాయుడు కుప్పం నియోజక వర్గం నుంచి పోటీ చేసి వరుసగా గెలుస్తున్న సంగతి తెలుస్తున్నదే. అయితే తన స్వంత ఊరు అయినా చంద్ర గిరి ని వదిలేసి బాగా వెనుకబడిన నియోజక వర్గం అయినా కుప్పం ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే చంద్ర గిరి లో ఒడి పోయిన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాజశేఖర్ కుటుంబానికి పులివెందుల ఎలాగో చంద్ర బాబుకు ఈ కుప్పం అలా అని చెప్పావచ్చు. 

Image result for vijaya sai reddy

అలాంటి చోట, ఏకంగా చంద్రబాబు మీదనే తొడకొట్టి సవాలు చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సిద్ధం అవుతున్నారు. కుప్పం నియోజకవర్గం అంటేనే చంద్రబాబు నాయుడు కు కంచుకోటగా పేరుంది. అత్యంత భారీ మెజారిటీలతో ఆయన అక్కడ విజయాలు సాధిస్తుండేవారు. చంద్రబాబుకు అక్కడ ఎంతగా బలం ఉన్నదంటే.. చిత్తూరు ఎంపీ నియోజకవర్గ పరిధిలో తతిమ్మా అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశానికి ప్రతికూల పవనాలు ఉన్నప్పటికీ కూడా.. ఒక్క కుప్పంలో దక్కే మెజారిటీ ద్వారా ఆ ఎంపీ స్థానాన్ని కూడా వారు చేజిక్కించుకోవడం రివాజుగా మారింది.

Image result for vijaya sai reddy

 తమ పార్టీకి ఆదరణ పెరుగుతున్నదని వారు నమ్ముతున్నప్పుడు.. ఏకంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియోజకవర్గంలోనే ఆయన మీద తొడకొట్టి పోటీచేయడానికి సిద్ధమేనంటూ చేసిన ప్రకటన చిన్నదేమీ కాదు. ఫలితాలు ఎలాగైనా ఉండవచ్చు గాక కానీ.. తమకు ఆదరణ పెరుగుతున్నదనే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారని రాష్ట్ర ప్రజలకు దీని ద్వారా సంకేతం ఇవ్వడం జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంత బలమైన స్థానంలో చంద్రబాబు మీద పోటీచేయడానికి విజయసాయి సిద్ధపడడం విశేషమే.


మరింత సమాచారం తెలుసుకోండి: