తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ నేత కేసీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.  అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో కేంద్రంతో మొన్నటి వరకు స్నేహసంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. అభివృద్దిలో తెలంగాణ నెంబర్ వన్ అని చెప్పుకుంటూ తిరుగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తమ కుటుంబ సభ్యులకు మాత్రమే అన్ని రకాల సదుపాయాలు..సౌకర్యాలు కల్పించారు. గత కొంత కాలంగా తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. 
Image result for telangana
ఆ మద్య అసెంబ్లీలో చెలరేగిన వివాదంలో ఎమ్మెల్యే కోమటి రెడ్డి, సంపత్ కుమార్ లను సస్పెండ్ చేయడం..పెను సంచలనాలు సృష్టించింది.  వచ్చే ఎన్నికల్లో సీఎంగా తన వారసుడిని రంగంలోకి దించాలని..కేసీఆర్ ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారని..ఈ నేపథ్యంలో  జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని దేశ వ్యాప్తంగా తిరుగుతున్నారని..అదంతా ఒట్టి బూటకం అని తన స్వార్థం కోసమే చేస్తున్న కుఠిల ప్రయత్నాలని ఆరోపిస్తున్నారు..టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రవణ్ దాసోజు.  ‘కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఓ బూటకమని, ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుట్రలో భాగంగానే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు.
Image result for kcr third front
ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, డీఎంకే నేత స్టాలిన్ తదితర నేతలకు తాను లేఖలు రాసినట్టు శ్రవణ్ పేర్కొన్నారు.  జాతీయ స్థాయిలో ఎప్పటి నుంచి ప్రజాదరణ పొందిన కాంగ్రెస్, బీజేపీలను ఢీ  కొట్టం అంటే అంత ఆశామాశి వ్యవహారం కాదని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో యూపీఏని, కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్రలో భాగంగానే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటించారని, జాతీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: