ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీకి షాక్ త‌గిలింది. మాజీ ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తి రాజు(కన్నబాబు) టీడీపీకీ రాజీనామా చేసి వైసీపీలో చేరుతాన‌ని ప్ర‌క‌టించారు. గత కొంత కాలంగా ఏపీలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ మద్య కొంత మంది నేతలు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు..కానీ ఈ మద్య టీడీపీ నుంచి వైసీపీలో కి మారుతున్నారు.  తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం జిల్లా మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, ఆయన కుమారుడు సుకుమార వర్మ టీడీపీకి పార్టీకి గుడ్ బై చెప్పారు. 

Image result for tdp

రాజీనామా లేఖ‌ల‌ను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, రాష్ట్ర, రూరల్‌ జిల్లా అధ్యక్షులు కళా వెంకటరావు, పంచకర్ల రమేష్‌బాబులకు పంపినట్టు సుకుమారవర్మ తెలిపారు. అంతే కాదు పెద్ద ఎత్తున తమ అనుచరులతో కలసి శనివారం వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. 

Image result for ysrcp

కన్నబాబు విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేశారు. 2014 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. పార్టీలో స‌రైన గౌర‌వం ఇవ్వ‌క‌పోవ‌డంతో పార్టీ మారేందుకు నిర్ణ‌యించుకున్నారు.కాగా, వైసీపీలో చేరతానని ప్రకటించిన కన్నబాబుకు మంత్రి గంటా శ్రీనివాసరావు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. 

kanna babu resigns for TDP

ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక అందులో మార్పు ఉండదని టీడీపీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు కన్నబాబురాజు తెలిపారు. పార్టీలో స‌రైన గౌర‌వం ఇవ్వ‌క‌పోవ‌డంతో పార్టీ మారేందుకు నిర్ణ‌యించుకున్నారు.సీపీ అధినేత జగన్ సమక్షంలో ఈరోజు సాయంత్రం పార్టీ కండువా కప్పుకుంటామని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: