నేడు మహిళలపై, బాలికలపై, పసిపాపలపై కారుణ్యం సైతం చూపకుండా మైనర్ల నుండి నుసలివాళ్ళవరకు వయోభేధం విచక్షణ ఙ్జానం లేకుండా లైంగిన దాడులు, అమానుష కృత్యాలు కొనసాగిస్తున్నారు. పసువులు సైతం సిగ్గుపడే అసాఘిక కార్యకలాపాలు చేయటం మనం రోజూ వార్తా పత్రికల్లో చదువుతున్నాం. వివిధ చానళ్లలో అరాచకాలను చూస్తున్నాం. నిర్భయ, పొక్సో లాంటి వివిధ కఠిన చట్టాలు కూడా ఈ పాపకార్యాల ముందు నిర్వీర్యమై పోతున్నాయి. 


భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఏమై పోయాయి? అనేది నేటి సమస్య. చట్టాలను చేయటం మాత్రమే కాదు శరవేగంగా నేఱగాల్ల వెన్నులో చలిపుట్టించే విధంగా చట్టాలను అమలు పరచటం ముఖ్యం. ఇలాంటి కేసుల్లో కాలయాపన ఏ దశలో జరిగినా ఆ అధికారులను కూడా చట్ట ప్రకారం శిక్షించటంలో వెనకంజ వేయరాదని అంటున్నారు ప్రజలు.   నేఱగాళ్ళ నేపధ్యంలో ఎంతటివారున్నా క్షమించకూడదు. 


చికిత్స కోసం ఉస్మానియా వైద్యశాలకు వచ్చిన ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రికి చెందిన వార్డు బాయ్‌, అఫ్జల్‌ గంజ్‌ పోలీసుస్టేషన్‌కు చెందిన హోంగార్డు, ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవరు ముగ్గురు కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.  అఫ్జల్‌ గంజ్‌ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం, బంజారాహిల్స్‌ సమీపంలోని హీరానగర్‌ బస్తీకి చెందిన ఒక మహిళ (35) ఈనెల 2న భర్తతో గొడవ పడింది. భర్త ఆమె ను కొట్టడంతో అదే రోజు రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
సంబంధిత చిత్రం
ఎస్కార్టుగా మహిళా పోలీసులను ఆమె వెంట పంపకుండా, మెడికో లీగల్‌ కేసు నమోదు చేయాలని ఉస్మానియా వైద్యాధికారులకు లేఖ రాసి ఆమె చేతికే ఇచ్చి పంపించారు. చికిత్స నిమిత్తం ఉస్మానియాకు చేరిన ఆమెను అత్యవసర చికిత్సావిభాగం (క్యాజువాల్టీ)లో విధులు నిర్వర్తించే వార్డుబాయ్‌, వైద్యం చేయించడంతో పాటు నీ భర్తపై కేసు నమోదు చేయిస్తానంటూ నమ్మించాడు. 


వైద్యం చేయించిన అనంతరం వార్డుబాయ్‌, ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌, అఫ్జల్‌ గంజ్‌ పోలీసు అవుట్‌ పోస్టుకు చెందిన హోంగార్డు కలిసి తనను అవుట్ పోస్ట్ భవనం మొదటి అంతస్తులోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు తెల్లవారు జామున ఉస్మానియా ప్రధాన గేటు దగ్గరున్న కానిస్టేబుల్‌ సాయంతో బంజారా హిల్స్‌ పోలీసులను ఆశ్రయించింది. 
atrocities on women కోసం చిత్ర ఫలితం

అత్యాచారం జరిగిన ప్రాంతం అఫ్జల్‌ గంజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోనికి వస్తుందని బంజారాహిల్స్‌ పోలీసులు ఆమెను పంపించేశారు. అనంతరం తను పనిచేసే ఇంట్లో న్యాయవాది సహాయం తో బాధితురాలు శుక్రవారం అఫ్జల్‌ గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఉస్మానియా ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, ప్రధాన ప్రవేశ మార్గం, రెండో అంతస్తులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.


రాత్రి విధుల్లో ఎంత మంది సిబ్బంది ఉన్నారని ఆరా తీశారు. ఉస్మానియా ఆసుపత్రి వార్డుబాయ్‌ నాగరాజుపైనే బాధితురాలు ఫిర్యాదు చేసిందని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అఫ్జల్‌ గంజ్‌ ఎస్సై సైదులు తెలిపారు. మరో ఇద్దరిపై ఫిర్యాదు అందలేదన్నారు.

osmania general hospital hyderabad కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: