తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,అస్సాం,ఒడిషా రాష్ట్రాలో ఎన్నో నేరాలకు పాల్పడిన గ్యాంగ్ స్టర్, మాజీ నక్సలైట్ నయీమ్ పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే.  తెలంగాణ లోని భువనగిరి జిల్లాలో చిన్న చిన నేరాలకు పాల్పడుతూ వచ్చిన నయీమ్ అప్పట్లో నక్సలైట్స్ లో చేరారు..తర్వాత వారితో అభిప్రాయ భేదాలు వచ్చి బయటకు వచ్చాడు.  తర్వాత కొంత మంది ముఠాతో కలిసి నేరాలకు పాల్పడటం..పోలీసులకు కొవర్టు గా వ్యవహరించడం..భూ దందాలు, కిడ్నాపులు, మర్డర్లు ఇలా ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు నయీమ్. 

అప్పటి వరకు నయీమ్ ఒక గ్యాంగ్ స్టర్ గా మాత్రమే తెలుసు..కానీ నయీమ్ మృతి తర్వాత అతని ఆస్తుల చిట్టా చూసి పోలీసులు ఖంగు తిన్నారు.  నయీమ్ అరాచకాలతో పాటు అడ్డగోలిగా డబ్బులు, భూములు,బంగారం సంపాదించాడు.  అయితే అమ్మాయిలను విక్రయించడం, అక్రమ ఆయుధాల సరఫరాలకు తెగించిన నయీమ్ విషయంలో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది.  పక్కా నిఘా పెట్టిన పోలీసులు అతన్ని ఎన్ కౌంటర్ లో కాల్చి వేశారు. అయితే నయీమ్ మృతి తర్వాత కొంత మంది పోలీసులు చిట్టా కూడా బయట పడింది.
Image result for gangster nayeem wife arrest
ఇక రెండు సంవత్సరాల క్రితం ఎన్ కౌంటర్ లో మరణించిన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసును విచారిస్తున్న సిట్ పోలీసులు తాజాగా, ఆయన భార్య హసీనాను అరెస్ట్ చేశారు. భువనగిరిలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. నయీమ్ ఎన్ కౌంటర్ తరువాత అతని కుటుంబీకుల్లో పలువురిని పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.
Image result for gangster nayeem wife arrest
అంతే కాదు నయీమ్ కోడలు, అల్లుడు, మరో అనుచరుడిని గతంలోనే అరెస్ట్ చేసిన పోలీసులు, తవ్వుతున్నకొద్దీ ఈ కేసులో ఎన్నో నిజాలు బయటకు వస్తున్నాయని అంటున్నారు. వాటిపై మరిన్ని ఆధారాలు, వివరాలు సేకరించాలన్న ఉద్దేశంతోనే హసీనాను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: