వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కి గ్రామాల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. అయితే ఈ క్రమంలో జగన్ తెలుగుదేశం పార్టీ నాయకులూ.. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అవినీతి కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు. మరోపక్క వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేయబోతోందో సామాన్య మానవుడికి అర్థమయ్యే రీతిలో చక్కగా వివరిస్తున్నారు జగన్.

ఈ సందర్భంగా మద్యనిషేధం..అలాగే గ్రామ సచివాలయం వంటి కార్యక్రమాలు గురించి ఎక్కువగా వివరిస్తున్నారు. ఎవరికైనా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామంలోనే సచివాలయం ఏర్పాటుచేసి సమస్య అక్కడే 24 గంటలలోగా పరిష్కారమయ్యేలా తీసుకుంటామని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

రీసెంట్ గా అంగన్ వాడీ కార్యకర్తల జీతాల గురించి ప్రస్తావించిన జగన్ తెలంగాణలో 10,500 వేతనం ఇస్తున్నారని, అయితే ఏపీలో టీడీపీ ప్రభుత్వం కేవలం 7,000 మాత్రమే ఇస్తున్నారని అంగన్ వాడీ కార్యకర్తల నుంచి తెలుసుకున్నారు. అంతే కాకుండా మూడు నెలల జీతం రాలేదని చెప్పడంతో జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వంపై తాము పోరాటం చేస్తామని చెబుతూ.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సిపి అధికారంలోకి వచ్చాక తెలంగాణాలో ఇస్తోన్న జీతాలకంటే వెయ్యి రూపాయలు ఎక్కువగానే ఇస్తామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా మూడు నెలల జీతం వచ్చేలా కృషి చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. తాజాగా జగన్ ప్రకటనతో అంగనవాడి కార్యకర్తలు తమ సంతోషం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: