ఎన్నిక‌ల సంవ‌త్స‌రంలో చంద్ర‌బాబునాయుడు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం నిర్ణ‌యించారా ? బిజెపి మంత్రులు రాజీనామా చేసిన స్ధానాలను భ‌ర్తీ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. దానితో పాటు మ‌రి కొంద‌రికి మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పిస్తారా లేదా అన్న‌ది చూడాల్సిందే. పార్టీలోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌చారం ఈనెల‌ 15వ తేదీన ముహూర్తం బాగుంద‌ని చంద్ర‌బాబు అనుకుంటున్నార‌ట‌.
Image result for tdp
ఇంత అర్జెంటుగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని ఎందుక‌నుఉంటున్నారు ? అంటే మంత్రివ‌ర్గంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కామినేని శ్రీ‌నివాస‌రావు, పైడికొండ‌ల మాణిక్యాల‌రావు త‌ప్పుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే క‌దా?  కేంద్ర‌ప్ర‌భుత్వం నుండి ఎన్డీఏ నుండి తెలుగుదేశంపార్టీ త‌ప్పుకోవ‌టంతో రాష్ట్ర మంత్రివ‌ర్గానికి బిజెపికి చెందిన ఇద్ద‌రు మంత్రులు రాజీనామాలు చేశారు. దాంతో దాదాపు రెండు నెల‌లుగా వారి స్ధానాలు భ‌ర్తీ కాకుండా అలానే ఉండిపోయాయి.
Image result for kamineni manikyala rao
రెండు స్ధానాలు ఖాళీ
ఒక‌వైపు ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టం, ఇంకోవైపు మంత్రిప‌ద‌వుల కోసం పెరిగిపోతున్న ఆశావ‌హుల ఒత్తిడి పెరిగిపోతుండ‌టంతో క‌నీసం ఖాళీల‌నైనా భ‌ర్తీ చేస్తే బాగుంటుంద‌ని చంద్ర‌బాబు యోచిస్తున్న‌ట్లు స‌మాచారం.  రాజీనామాలు చేసిన బిజెపి మంత్రులిద్ద‌రూ క‌మ్మ‌, కాపు సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన వారు. కాబ‌ట్టి ఆ సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన ఎంఎల్ఏల‌తోనే భ‌ర్తీ చేస్తే ఎలాగుంటుంద‌ని ఆలోచిస్తున్న‌ట్లు పార్టీవ‌ర్గాలంటున్నాయి. 
Image result for akhila priya
సామాజిక‌వ‌ర్గాల స‌మ‌తూకానికే ప్రాధాన్య‌త‌
అదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం మంత్రులుగా ఉంటున్న వారిలో కొంద‌రి ప‌నితీరు ఏమాత్రం బాగుండటం లేద‌నే అభిప్రాయం చంద్ర‌బాబులో ఉంది. అటువంటి వారిలో ప‌ర్యాట‌క శాఖ మంత్రి అఖిల‌ప్రియ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. కాక‌పోతే ప‌నితీరు పేరుతో కొంద‌రిని ప‌క్క‌న బెడ‌తారా ?  సామాజిక‌వ‌ర్గాల స‌మ‌తూకం పేరుతో కంటెన్యూ చేస్తారా అన్న‌ది తేల‌టం లేదు.
Image result for kodela siva prasad
కోడెల‌కు మంత్రి ప‌ద‌వా ?
స్పీక‌ర్ ప‌ద‌విలో ఎప్ప‌టి నుండో  కోడెల శివ‌ప్ర‌సాద‌రావు అసంతృప్తిగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాల‌ని స్పీక‌ర్ చంద్ర‌బాబును కోరిన‌ట్లుగా కూడా ప్ర‌చారంలో ఉంది. ఎటుతిరిగి ఎన్నిక‌ల చివ‌రి సంవ‌త్సరం కాబ‌ట్టి కోడెల‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకునే అవ‌కాశాలున్న‌ట్లు పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల సంవ‌త్స‌రంలో మంత్రిప‌ద‌వులు రానివారితో చిక్కులు కూడా త‌ప్ప‌వన్న విష‌యం చంద్ర‌బాబుకు తెలీంది కాదు. మొత్తం మీద మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌ధ్యంలో ఏం జ‌రుగుతుందో వేచిచూడాల్సిందే. 

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణకు ముహూర్తం నిర్ణ‌యించారా ?

ఎన్నిక‌ల సంవ‌త్స‌రంలో చంద్ర‌బాబునాయుడు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం నిర్ణ‌యించారా ? బిజెపి మంత్రులు రాజీనామా చేసిన స్ధానాలను భ‌ర్తీ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. దానితో పాటు మ‌రి కొంద‌రికి మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పిస్తారా లేదా అన్న‌ది చూడాల్సిందే. పార్టీలోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌చారం ఈనెల‌ 15వ తేదీన ముహూర్తం బాగుంద‌ని చంద్ర‌బాబు అనుకుంటున్నార‌ట‌. ఇంత అర్జెంటుగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని ఎందుక‌నుఉంటున్నారు ? అంటే మంత్రివ‌ర్గంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కామినేని శ్రీ‌నివాస‌రావు, పైడికొండ‌ల మాణిక్యాల‌రావు త‌ప్పుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే క‌దా?  కేంద్ర‌ప్ర‌భుత్వం నుండి ఎన్డీఏ నుండి తెలుగుదేశంపార్టీ త‌ప్పుకోవ‌టంతో రాష్ట్ర మంత్రివ‌ర్గానికి బిజెపికి చెందిన ఇద్ద‌రు మంత్రులు రాజీనామాలు చేశారు. దాంతో దాదాపు రెండు నెల‌లుగా వారి స్ధానాలు భ‌ర్తీ కాకుండా అలానే ఉండిపోయాయి.

రెండు స్ధానాలు ఖాళీ

ఒక‌వైపు ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టం, ఇంకోవైపు మంత్రిప‌ద‌వుల కోసం పెరిగిపోతున్న ఆశావ‌హుల ఒత్తిడి పెరిగిపోతుండ‌టంతో క‌నీసం ఖాళీల‌నైనా భ‌ర్తీ చేస్తే బాగుంటుంద‌ని చంద్ర‌బాబు యోచిస్తున్న‌ట్లు స‌మాచారం.  రాజీనామాలు చేసిన బిజెపి మంత్రులిద్ద‌రూ క‌మ్మ‌, కాపు సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన వారు. కాబ‌ట్టి ఆ సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన ఎంఎల్ఏల‌తోనే భ‌ర్తీ చేస్తే ఎలాగుంటుంద‌ని ఆలోచిస్తున్న‌ట్లు పార్టీవ‌ర్గాలంటున్నాయి. 

సామాజిక‌వ‌ర్గాల స‌మ‌తూకానికే ప్రాధాన్య‌త‌

అదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం మంత్రులుగా ఉంటున్న వారిలో కొంద‌రి ప‌నితీరు ఏమాత్రం బాగుండటం లేద‌నే అభిప్రాయం చంద్ర‌బాబులో ఉంది. అటువంటి వారిలో ప‌ర్యాట‌క శాఖ మంత్రి అఖిల‌ప్రియ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. కాక‌పోతే ప‌నితీరు పేరుతో కొంద‌రిని ప‌క్క‌న బెడ‌తారా ?  సామాజిక‌వ‌ర్గాల స‌మ‌తూకం పేరుతో కంటెన్యూ చేస్తారా అన్న‌ది తేల‌టం లేదు.

కోడెల‌కు మంత్రి ప‌ద‌వా ?

స్పీక‌ర్ ప‌ద‌విలో ఎప్ప‌టి నుండో  కోడెల శివ‌ప్ర‌సాద‌రావు అసంతృప్తిగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాల‌ని స్పీక‌ర్ చంద్ర‌బాబును కోరిన‌ట్లుగా కూడా ప్ర‌చారంలో ఉంది. ఎటుతిరిగి ఎన్నిక‌ల చివ‌రి సంవ‌త్సరం కాబ‌ట్టి కోడెల‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకునే అవ‌కాశాలున్న‌ట్లు పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల సంవ‌త్స‌రంలో మంత్రిప‌ద‌వులు రానివారితో చిక్కులు కూడా త‌ప్ప‌వన్న విష‌యం చంద్ర‌బాబుకు తెలీంది కాదు. మొత్తం మీద మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌ధ్యంలో ఏం జ‌రుగుతుందో వేచిచూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: