ఈ మద్య ఎక్కడ చూసినా మహిళలపై గ్యాంగ్ రేపులు..హత్యలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వం కఠినమైన చట్టాలు అమలు పరుస్తున్నామని చెబుతున్నా..అవేమీ లెక్కచేయకుండా కామంధులు ఎక్కడో అక్కడ రెచ్చిపోతూనే ఉన్నారు.  తాజాగా ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన ఓ మహిళపై జరిగిన గ్యాంగ్ రేప్ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తీవ్ర ఆవేదన..అసహనం వ్యక్తం చేశారు.
Image result for rape images
అంతే కాదు పోలీసులు అంటే ప్రజలు రక్షకుల్లా చూడాలే తప్ప శత్రువుల్లా చూడకూడదని.. పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళలను జాగ్రత్తగా చూసుకోవాలంటూ పోలీసులను హెచ్చరించారు. ఈ మేరకు తన వాయిస్ రికార్డింగును పోలీసు అధికారులకు, సిబ్బందికి వాట్సాప్ ద్వారా పంపారు."మిత్రులారా, ఉస్మానియా ఆసుపత్రిలో జరిగిన దారుణాన్ని అందరూ పేపర్ లో చూశారు కదా. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి ఒక మహిళ వెళ్లింది. ఆమెను అర్ధరాత్రి పూట వైద్యం కోసం ఉస్మానియాకు పంపారు.
Image result for rape images
ఆమె వెంట సెక్యూరిటీగా వెళ్లాలనే బాధ్యతను కూడా మరిచారు...ఒంటరిగా ఉన్న ఆ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. మరోబాధాకరమైన విషయం ఏంటేంటే ఇందులో ఆసుపత్రి ఔట్ పోస్టులో ఉన్న ఒక హోంగార్డు కూడా ఉన్నారు. ఈ ఘటనతో హైదరాబాద్ పోలీసులకు చెడ్డ పేరు వచ్చింది. ప్రతి కేసును కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి" అంటూ పోలీసు అధికారులను, సిబ్బందిని కమిషనర్ హెచ్చరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: