జ‌నసేనాని దూకుడు పెంచాడు. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో.. పార్టీకి సంబంధించిన కీల‌క‌మైన నిర్ణ‌యాలు చ‌క‌చ‌కా తీసుకుంటున్నాడు. ఇప్ప‌టికే 175 సీట్ల‌లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అందుకు త‌గిన‌ట్టుగానే వ్యూహ‌క‌ర్త‌ను కూడా పెట్టుకుని ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాలు విసురుతున్నాడు. ఆగ‌స్టులో పార్టీ విధివిధానాలు ప్ర‌క‌టించేందుకు రెడీ అవుతున్న స‌మ‌యంలోనే జ‌న‌సేన అభ్య‌ర్థులను కూడా ఖ‌రారు చేసే ప‌నిలో ప‌డ్డాడ‌ట‌. పార్టీకి ఆర్థికంగా అండ‌గా నిలుస్తూ.. త‌న వెన్నంటే న‌డుస్తున్న వారికి ఈసారి టికెట్ ఖ‌రారు చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం త‌నకు అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా మారిపోయిన టాలీవుడ్ నిర్మాత‌కు జ‌న‌సేనాని బంప‌ర్ ఆఫ‌ర్ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. 

Image result for nelaticket

ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా త‌క్కువ ఆడియో ఫంక్ష‌న్‌ల‌లో క‌నిపిస్తుంటారు. త‌న‌కు న‌చ్చిన‌, కావాల్సిన వ్యక్తుల సినిమాల ఆడియో ఫంక్ష‌న్ లేదా స‌క్సెస్ మీట్‌ల‌కు వ‌స్తుంటారు. కానీ ర‌వితేజ న‌టిస్తున్న నేల టికెట్ సినిమా ఫంక్ష‌న్‌కు ప‌వ‌న్ హాజ‌ర‌వుతుండ‌టం అంద‌రికీ ఆశ్చ‌ర్యం క‌లిగించే అంశ‌మే. దీనికి కార‌ణం ఆ సినిమా ప్రొడ్యూస‌ర్ రామ్ తాళ్లూరి. అవును రామ్ తాళ్లూరికీ పవ‌న్‌కు మ‌ధ్య ఎప్పుడు ఎక్క‌డ సాన్నిహిత్యం ఏర్ప‌డింద‌నే సందేహాలు అంద‌రిలోనూ ఉన్నాయి. రామ్ తాళ్లూరి విషయానికి వస్తే లీడ్ కార్పొరోషన్ - రామ్ ఇన్నోవేషన్స్ - రామ్ ఎంటర్ ప్రైజెస్ (స్కై జోన్) మరియు ట్యూటర్ వెబ్ కు డైరెక్టర్ గా  ఉన్నారు. ఐటీ పరిశ్రమలో14 ఏళ్ల అనుభవం ఉన్న రామ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
Related image
కొద్దికాలంగా జనసేన పార్టీకి రామ్ నిధులు సమకూర్చడంతో పాటు పార్టీ కోసం యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. జనసేన పార్టీకి చెందిన ఎన్నారై విభాగాల కార్యకలాపాలు ముఖ్యంగా పార్టీ అమెరికా విభాగానికి చెందిన కార్యక్రమాలను ఆయన సమన్వయం చేస్తున్నారని సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నారై విభాగం సమావేశం కూడా రామ్ నేతృత్వంలోనే జ‌రిగింద‌ట‌. ఇక్క‌డే ప‌వ‌న్‌కు రామ్‌కు మ‌ధ్య బంధం ఏర్ప‌డింద‌ని చెబుతున్నారు. ఈ పరిణామాలన్నింటినీ క్రోడీకరిస్తే రాబోయే ఎన్నికల్లో రామ్ జనసేన తరఫున బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది. ఇదే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. 

Image result for రామ్ తాళ్లూరి

రామ్ తాళ్లూరికి చెందిన తాజా సినిమా నేల టికెట్ ఫంక్ష‌న్‌కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కు, రామ్ కు ఉన్న దోస్తీ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదనే విష‌యంలో క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ఆయ‌న‌కు టికెట్‌పైనే అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌స్తే మ‌రింత స్ప‌ష్ట‌త వ‌స్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: