నరెంద్ర మోడీ ప్రచారం మొదలెట్టగానే కర్ణాటకలో "కాంగ్రెస్ గెలుపు కల చెదిరింది కర్ణాటక ఎన్నికల కథ మారింది" అనే విధంగా పరిస్థితులు మారిపొయ్యాయని అంటు న్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒపీనియన్ పోల్స్ హవా కొనసాగుతోంది. కన్నడనాట మళ్లీ కాంగ్రెస్‌ కే ప్రజలు పట్టం కట్టనున్నట్లు ఎక్కువ సంఖ్యలో ఇటీవలి సర్వేలు తేల్చాయి. 

అయితే "జనతా కీ బాత్" అనే సంస్థ నిర్వహించిన సర్వే ఒకింత ఆశ్చర్యకరమైన ఫలితాలను వెల్లడించింది. దీని ప్రకారం బిజెపి 100 సీట్లలో గెలుపు సాధించబోతూ ఉన్నదని, కాంగ్రెస్ రెండంకెల సంఖ్యకే పరిమితమౌతుందని ఈ సర్వే ద్వారా తెలుస్తుంది. అయితే జెడిఎస్ మాత్రం కింగ్ మేకర్ అయ్యే అవకాశాలలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. 

మే 3వరకు లక్షా ఇరవై వేల మంది నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఈ సర్వే లో బీజేపీ భారీగా పుంజుకుంటుందని, కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీలు చతికిలబడి పోతాయని పేర్కొంది ప్రజాభిప్రాయం భిన్న భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీని ప్రకారం 102-108స్థానాలు బీజేపీకి వస్తాయని, కాంగ్రెస్‌కు 72-74స్థానాలు మాత్రమే వస్తాయని తేల్చింది. ఇక పోతే జేడీ(ఎస్)కు 42-44స్థానాలు వస్తాయని, మిగిలిన వారికి 2-4 స్థానాలు వస్తాయిని పేర్కొంది. 



మే 3తర్వాత ప్రచారానికి మరో వారం గడువు ఉండడం తో ఓటర్లలో కమలానికి మద్దతు మరింత పెరిగే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.  అయితే 2013లో కాంగ్రెస్ 80నుంచి 122స్థానాలు దక్కించుకొని అధికారాన్ని కైవసం చేసుకోగా, బిజెపి 110స్థానాల నుంచి 40 స్థానాలకు పరిమితమై ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ఈ రోజు టివి5 /ఫ్లాష్ ప్రీ పోల్ సర్వే కూడా బిజెపికి 115 స్థానాలు గెలుస్తుందని తెలిపింది. వివరాలు రావలసి ఉంది. 


తటస్థ హిందూ ఓటర్లు లింగాయత్తుల పేరుతో హిందూ మతాన్ని విడగొట్టటానికి జరిగే కాంగ్రెస్ ప్రయత్నాలు చూస్తుంటే కాంగ్రేస్ మత రహిత పాలన అందించలేదని ఋజువౌతూ ఉందని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు దేశం మత చాందస వాదంతో దహించుకు పోతుంటే మరో కొత్త మతావిష్కతరణాన్ని లౌకిక వాదులేకాదు దేశ ఐఖ్యత కోరుకునే ప్రజలు అంగీకరించ లేక పోతున్నారు. ఇది అంతర్లీనంగా చాప కింద నీరులా వ్యాపించి ఉంది. ఏ కొందరో లింగాయత్లు కాంగ్రేస్ కు తమను మైనారిటీల్లో చేర్చటాన్ని అంగీకరిస్తూ ఓటేసినా - అంతకు రెట్టింపు ప్రజలు తటస్తుల్లో కాంగ్రెస్ కు ఓటు చేయని పరిస్థితి నెలకొని ఉంది కర్ణాటకలో. 

TV 5 suvey on karnataka elections కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: