ఎన్నికల వ్యూహంలో భాగంగా ప్రజాసంకల్ప యాత్ర అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో తన యాత్రను కొనసాగిస్తున్నాడు. అయితే అన్ని జిల్లాలో ప్రకటించినట్లుగా తమ వైసీపీ అధికారంలోకి వస్తే ఏమేమి చేయబోతున్నది అన్నీ కృష్ణా జిల్లాలో కూడా ప్రకటిస్తున్నాడు.


అయితే ఇక్కడ ఏమీ ప్రాధాన్యత గలిగిన విషయం లేదని భావిస్తే మీరు తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే కృష్ణా వాసుల మొత్తం ఓట్లను వెనుకేసుకోవడానికి ఇప్పటికే  ఎన్టీఆర్ పేరును వాడుకున్నాడు. కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తా అని చెప్పి కృష్ణా జిల్లా ప్రజల మనసులు గెలవడమే గాక వైసీపీ వ్యతిరేకుల నుండి కూడా మన్ననలను అందుకున్నాడు.


తాజాగా ఆయన మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. అంగన్ వాడీ కార్యకర్తల జీతాల గురించి విచారించిన జగన్, తెలంగాణలో 10,500 వేతనం ఇస్తుంటే, ఏపీలో  కేవలం 7,000 మాత్రమే ఇస్తున్నారని అంగన్ వాడీ కార్యకర్తల నుంచి తెలుసుకున్నారు. అంతేగాక మూడు నెలల జీతం రాలేదని చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాల విషయమై ప్రభుత్వంపై తాము పోరాటం చేస్తామని, వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన తరువాత  తెలంగాణాలో ఇస్తున్న జీతాలకంటే వెయ్యి రూపాయలు ఎక్కువగానే ఇస్తామని రాష్ట్రంలోని అంగన్ వాడీ కార్యకర్తలకు భరోసా ఇచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: