నాలుగుదశాబ్ధాల సుధీర్ఘ కాలంగా నిరంతరం మెరుగుపరుచుకుంటూ వస్తున్న రాజకీయ కాలఙ్జాని, రాజకీయపాఠాలు నేర్పే సునిసిత సూక్ష్మ పరిశీలన  ఆమూలాగ్రం   "శకునం చెప్పే బల్లే ఒక్కసారి కుడితిలోపడ్డ చందాన " జరిగిపోయిన చంద్రబాబునాయుని చారిత్రాత్మక తప్పిదం ఆయన కీర్తిచంద్రికలని  మూసీమురుగులో కలిపేసింది.
kcr chandrababu కోసం చిత్ర ఫలితం
కలసిపోయిన  ఎందరికో కనువిప్పు. ఇంతకాలం నిద్రాణంగా ఉన్న ఈ కేసు "ఆరునెలలకు మించి విచారణ నిలుపుదల చేసిన కేసులకు పరిష్కారం చూపే దశ" తొందర పెట్టటంతో కావచ్చు చంద్రశేఖరుడు తన మూడో నేత్రం తెరిచాడేమో? బొమ్మాళీ నిన్నొదల! అంటూ చంద్రబాబును వెంటాడుతున్న ఓటు కు నోటు కేసు! మళ్ళా ఓపెన్ అయి ఇప్పుడు ఇక వేటాడ నుందా? టైమింగే అసలు ఝలక్ ఎక్కడ నుండి ఈ కేసుకు కిక్ స్టార్ట్ తో ప్రాణం వచ్చిందో ? కాని, రాజకీయ వర్గాల్లో కలకలం, భయం మిన్నంటాయి. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను గుర్తుచేస్తున్నాయి. ఇన్నాళ్ళు స్థబ్దుగా ఉన్న పాండోరాస్ బాక్స్ ఓపెన్ అయిందా? అయితే జరిగేదేమిటి ప్రస్తుతం ఏ నలుగురూ కలిసినా చర్చనీయ అంశంగా మారింది.   
cash for vote ak khan acb కోసం చిత్ర ఫలితం
అవినీతి నిరోధక శాఖ ఎలానైనా విచారణ చేయవచ్చు. న్యాయస్థానాలు ఎలాంటి తీర్పైనా చెప్పొచ్చు. నిప్పు లాంటి చంద్రుని జీవన ముఖంపత్రంపై  విశ్వజనావళి వీక్షించిన "అవినీతి అక్రమ చారికలు" మాత్రం కాలగర్భంలో కలసిపోయేది మాత్రం అవాస్తవం అది చిరస్మరణీయం. విశ్వమంతా వీక్షించిన అక్రమం సక్రమం కానేరదు.
రాజకీయ వేత్తలకు చంద్రబాబు జీవితం ఎంత ఙ్జాన ప్రభోధం నిస్తుందో అంతకు మించిన - హార్వార్డ్, స్టాన్-ఫొర్డ్, ఆక్స్ఫర్డ్ విశ్వవిధ్యాలయాల్లో బోధనాశంగా తీసుకోవలసిన "ఓట్ కు నోట్ కేస్ స్టడీ" గా మారిపోయింది. నేఱగాళ్ల నేఱం కనిపించనంతవరకు ఒకే గాని, అది అందరి కన్నులు మాత్రం నీ మీద అన్నట్లు ఆ కేసు మీదే ఉంటే ఎవరేమి చేయగలరు? అంటున్నారు ఇందులో ఏవరేమి చెప్పినా నేఱం నిజం. నేఱగాడు ఎవరో అందరికీ తెలుసు. అదీ అసలు పాయింట్.  

సంబంధిత చిత్రం

ఇటీవలి కాలంలో ప్రత్యేక హోదా - బీజేపీతో బంధం తెగిపోవడం వంటి అంశాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరో అనూహ్య షాక్ తగిలింది. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడిప్పుడే ఏపీలో ప్రతిపక్షాలను దెబ్బకొట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్న చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. చంద్రబాబు రాజకీయజీవితంలో కోలుకోలేని తప్పిదంగా పార్టీ నేతలు చర్చించు కునే “ఓటుకు నోటు కేసు” ను మళ్లీ తెరమీదకు తెచ్చారు.

case of cash for vote కోసం చిత్ర ఫలితం

తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి వార్తల్లో ప్రధానాంశంగా నిలిచింది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సోమవారం  (మే 7) ఈ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ఏసీపీ డీజీ పూర్ణచంద్రరావు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఏకే ఖాన్‌తో పాలు పలువురు అధికారులు, న్యాయ వాదులు పాల్గొన్నారు. ఈ కేసును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

case of cash for vote కోసం చిత్ర ఫలితం
“వాయిస్‌ రికార్డుపై ఫోరెన్సిక్‌ విభాగం ఇచ్చిన నివేదిక”ను దర్యాప్తు అధికారులు తాజాగా సీఎం కేసీఆర్‌ కు అందజేశారు. ఈ నేపథ్యంలో ఈకేసులో ఇకపై ఏవిధంగా ముందు కెళ్లాలనే అంశంపై అధికారులతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో తదుపరి కార్యాచరణగా ఏం చేయాలనే అంశంపై ఉన్నతస్థాయి అధికారులతోను,  న్యాయ నిపుణులతోనూ ప్రభుత్వం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
case of cash for vote కోసం చిత్ర ఫలితం
సమావేశానికి విశ్రాంత ఐపిఎస్ అధికారి ఏకే ఖాన్‌ను కూడా పిలవడం ప్రాధాన్యం సంతరించు కుంది. ఓటుకు నోటు ఉదంతం చోటుచేసుకున్న సమయంలో తెలంగాణ ఏసీబీ డీజీగా ఏకే ఖాన్‌ ఉన్నారు. సీఎంవో పిలుపు మేరకు ఆయన ప్రగతి భవన్‌కు వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. 
case of cash for vote కోసం చిత్ర ఫలితం
గతంలో ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ కోసం జరిగిన ఎన్నికల సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ వైపు తిప్పుకోవ డానికి టీ-టీడీపీ నేత‌లు పెద్ద మొత్తంలో డబ్బు ఆశజూపారనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఆడియో టేపులు, వీడియోలు బయటకి వచ్చాయి. మనవాళ్లు “బ్రీఫ్‌డ్ మీ" అంటూ చంద్రబాబు స్వరంతో పలికిన పలుకులు ఉన్న ఆడియో టేపులు అందులో మాటలు, నామినేటెడ్ ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్లు ఉన్న దృశ్యాలు బయటకి రావడంతో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది. 
case of cash for vote కోసం చిత్ర ఫలితం
"చంద్రబాబును ఇక ఆ దేవుడు కూడా రక్షించలేడు.." అంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. కొసమెరుపు ఏమంటే చంద్రబాబు నాయుడు మే 15తరవాత బిజెపిదృష్టి ఆంధ్రప్రదేశ్ పై ఉంటుందన్నదానికి కెసిఆర్ నాందిప్రస్థావన చేయట్లేదు కదా!  రాజకీయాల్లో తలపండిన విశ్లేషకుల వాదన. మోడీ-షా లు మహా ముదుర్లు కదా! కెసిఆర్ అనే స్ట్రైకరుతో సిబిఎన్ అనే రెడ్ కాయినును కొట్టట్లేదు కదా! ఫాలోడ్ బై రేవంత్. ఏమో? ఎవరికి తెలుసు? ఇంత అర్దాంతరంగ ఈ కేసు మరోసారి తెరపైకి రావటం అదీ ఈ సమయంలో రావటం అనేది “టైమింగ్” అందర్ని కనుబొమ్మలు ఏగరేసి చూసేలాగా చేసింది.
case of cash for vote కోసం చిత్ర ఫలితం
రాష్ట్ర విభజన నేపథ్యంలో హక్కుగా పదేళ్ల పాటు హైదరాబాద్ లో ఉండే అవకాశం దక్కినప్పటికీ నవ్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు పరిపాలన తరలించడం వెనుక
ఓటు కు నోటు కేసే కారణమనే చర్చ ఉంది. “హైదరాబాద్ ను వదిలేసి ఒక్క నిమిషం కూడా ముందు వెళ్లం. 10 ఏళ్లు ఇక్కడే ఉండి పాలిస్తాం-అవసరమైతే మరో ఐదేళ్ళు ఎక్స్టెన్షన్ కోరతాం” అని చెప్పిన ఏపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్టుండి హైదరాబాద్ నుంచి అమరావతికి పలాయనం చిత్తగించటం అమితాశ్చర్యానికి గురిచేసింది. 
case of cash for vote కోసం చిత్ర ఫలితం
ఆయనతో పాటు అన్నీ కారాలయాలు, అధికారులను రావాలని అధికారిక ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవని తాము కొంత కలం నూతన రాజధాని స్థిమితపడ్డాక రాలేమని చెప్పినా ఛంద్ర బాబు వినలేదని ఇంత పట్టు బట్టటం వెనుక ఓటుకునోటు భయమే కారణమని ప్రజల్లో బలమైన వాదన ఉంది. 
case of cash for vote కోసం చిత్ర ఫలితం
ఓటుకు నోటు కేసులో దొరికిపోయినందుకే కేసిఆర్ దెబ్బకు బేషరతుగా చంద్రబాబు అమరావతికి పలాయనం అయ్యారని  ప్రతిపక్ష వైసిపి యెద్దేవా చేస్తూ ఆరోపించింది. బాబు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తెలంగాణ సర్కార్ కు తాకట్టు పెట్టారు. ఓటుకు నోటు కేసు అనంతరం జరిగిన పరిణామాలను చూస్తే మేధావి అని చెప్పుకొనే చంద్రబాబు తన తొందరపాటుతో ఎదుటివారిని దెబ్బ తీసే ఎత్తుగడలో తానే బుక్ అయిపోయారని తను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారంటున్నారు. తాజా చర్చలతో కేసీఆర్ ఈ కేసును ఎలా ముందుకు నడపాలో తేల్చనున్నారనే చర్చ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతే కాడు ఈ టైములో ఈ కేసు మళ్ళా నోళ్ళు తెరవటంలోని “టైమింగ్” వెనుక బలమైన నేపధ్యం ఏమైనా ఉందా? అనేది అసలు ప్రశ్న. 

case of cash for vote కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: