చంద్రబాబుపై కేసీఆర్ బ్రహ్మాస్త్రం బయటకు తీస్తున్నారా.. మోడీ కేసీఆర్ వెనక ఉండి చంద్రబాబుకు చుక్కలు చూపించబోతున్నారా.. అవుననే అనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే.. ఎదుకంటే.. ఇన్నాళ్లూ గుర్రుకొట్టి నిద్రపోతున్న ఓటుకు నోటు భూతం ఇప్పుడు మళ్లీ ఆవులిస్తోంది. చంద్రబాబుకేసి ఆబగా చూస్తోంది.

Image result for kcr

ఇటీవలి కాలంలో అంతా మర్చిపోయిన ఓటుకు నోటు కేసు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై ఇప్పుడు కేసీఆర్ దృష్టి సారించారు. అవినీతి నిరోధకశాఖ పనితీరుపై సమీక్ష పేరుతో కేసీఆర్ ఈ అస్త్రం బయటకు తీసినట్టు కనిపిస్తోంది.  ఈ సమీక్షలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానంగా ఓటుకు నోటు కేసుపై చర్చించారు. కేసు ప్రస్తుత స్థితిగతులను అధికారులు సీఎంకు వివరించారు.

Image result for chandrababu

ఈ కేసు నుంచి తనను తప్పించాలని నిందితుడు మత్తయ్య చేసిన విజ్ఞప్తిని మన్నిస్తూ హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. దీనికి అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ ఏసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.

Image result for kcr governor

ఓవైపు కర్ణాటక ఎన్నికలు పూర్తికావస్తుండటం.. మరోవైపు కేసీఆర్ ఓటు కు నోటు కేసుపై దృష్టి పెట్టడం చూస్తుంటే చంద్రబాబును ఇరుకున పెట్టే వ్యవహారమేదో ఉన్నట్టే కనిపిస్తోంది. సరిగ్గా దీనికి ముందే కేసీఆర్ గవర్నర్ తో భేటీ కావడం కూడా ఈ అనుమానాలకు ఊతమిస్తోంది. మరి ఇంతకీ ఏం జరగబోతోందో.. కొన్ని రోజులు ఆగి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: