మొదట కర్ణాటక రాష్ట్రంలో జరుగబోయే ఎన్నికల నుండి ఈ హంగామా మొదలవనుంది. ఈనెల 12న జరుగబోయే కర్ణాటక ఎన్నికలకు ఆ రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయపార్టీలు సిద్దమయిపోయాయి. ఇంక ఎన్నికలు జరగటం, లెక్కించడం మాత్రమే మిగిలిపోయాయి అనే రీతిలో ఎవరికి వారు గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. దేశంలో ఎన్నికల వేడి మొదలయింది. 


కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలే కర్ణాటకలో కీలకమవగా, అందులోనూ తెలుగు వారు నివసించేప్రాంతాల్లో తెలుగు వారు వెళ్లి ప్రచారం నిర్వహించడం మూలాన ఆంధ్రులు సైతం ఈ ఎన్నికలపై ఆసక్తిని చూపుతున్నారు. తాజాగా జేడీఎస్ అధినేత,మాజీ ప్రధాని దేవెగౌడ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రబాబు, కేసీఆర్ ల మద్దతు తమకు ఉందని, వారు మమ్మల్ని గెలిపిస్తారని చెప్పుకొచ్చారు.


ఆయన ఈ వాఖ్యలు చేయడం వెనుక ఎటువంటి ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ బీజేపికి వ్యతిరేఖంగా మూడో కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో దేశంలోని అన్ని బీజేపీ వ్యతిరేఖ పార్టీలను కలుస్తూ, కలుపుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన జేడీఎస్ మద్దతు కోరాడు కాబట్టే ఆయన అలా మాట్లాడరని చెబుతున్నారు. ఏపీలో కూడా బాబు బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేయడంతోనే అక్కడ ఆ పార్టీకి సహకరిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: