ఈ మద్య వివాహ బంధాలు పెడదారి పడుతున్నాయి.  అగ్ని సాక్షిగా..వేద మంత్రాల సాక్షిగా పెద్దల సమక్షంలో ఒక్కటైన భార్యాభర్తలు నిండు నూరేళ్లు కలిసి జీవించాలని అనుకుంటారు..కానీ ఈ మద్య కొన్ని భార్య భర్తల మద్య ఎన్నో దారుణమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  భార్యపై అనుమానతంతో దారుణంగా చంపిన భర్తలు..భర్తలపై మోజు లేక ప్రియుడి మోజులో పడి భర్తలను దారుణంగా చంపిన భార్యల కేసులు వెలుగులోకి వస్తున్నాయి.  ఈ మద్య కొంత మంది భార్యలు ప్రియుడిపై మోజుతో తమ భర్తలను అతి దారుణంగా చంపిన వార్తలు మరువక ముందే..తాజాగా ఇలాంటి దారుణ ఘటన పార్వతీపురం వెలుగు చూసిన విషయం తెలిసిందే. 
Image result for murder
ఇష్టంలేని పెళ్లితో రగిలిపోయిన భార్య సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు.  శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి అదే మండలం చిట్టిపుడివలస గ్రామానికి చెందిన యామక గౌరీ శంకరావుతో గత నెల 28న వివాహం జరిగింది. అయితే సరస్వతికి శంకర్‌రావు అంటే ఇష్టం లేదు..తన ప్రియుడి విషయంలో అడ్డు వస్తాడని భావించింది. సోమవారం ద్విచక్ర వాహనాన్ని సర్వీసింగ్‌కు ఇచ్చేందుకు ఇరువురూ పార్వతీపురం వచ్చారు. ఇదే అదును అనుకుని తమ సమాచారం తన ప్రియుడికి ఇచ్చింది.  చీకటిపడుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో శంకర్‌రావు తలపై మోదారు.
Image result for murder
దీంతో తీవ్ర రక్తస్రావమై శంకర్‌రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే తన భర్తను చంపాలిని సరస్వతే దుండగులకు సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించిందని పోలీసులు వివరించారు. అంతే కాదు ఎవరికీ అనుమానం రాకుండా... జాగ్రత్తపడ్డ నిందితురాలు దుండగులు దారికాచి తన భర్తను చంపేశారని, మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారంటూ పోలీసుల వద్ద మొసలికన్నీరు కార్చింది. అయితే ఆమె చెప్పిన సమాధానం పొంతన లేకుండా ఉండటంతో..అసలు విషయాన్ని కూలీ లాగారు పోలీసులు.  పార్వతీపురం నుంచి జిల్లా కేంద్రానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అనుమానితుల్ని విచారించారు. 

పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఎస్పీ అనుమానం మరింత బలపడింది. వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ తరహాలో విచారణ జరపగా అసలు విషయాన్ని తెలిపారు. ఇష్టంలేని పెళ్లి వల్లే భర్త శంకర్‌రావును భార్య హత్య చేయించిందని.. భర్తను చంపేందుకు వైజాగ్‌కు చెందిన రౌడీషీటర్‌ గోపీకి సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది. పార్వతీపురం ITDA పార్క్‌ వద్ద శంకర్రావును హత్యచేసింది తామేనని ఆ ముగ్గురూ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.  కాగా, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సరస్వతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: