నేను ఏ రాజకీయపార్టీలో చేరను గానీ పార్టీకి వ్యక్తిరేఖంగా ప్రచారం నిర్వహిస్తాను అని చెప్పి రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉంటున్నాడు బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్. దేశ రాజకీయ పరిస్థితులపై వాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. మొన్న కావేరి జల వివాదంలో కేంద్రమంత్రులను కలసిన ఆయన మొన్న కేసీఆర్ తో తృతీయ కూటమిపైనా చర్చించి సస్పెన్స్ కు తెరదీశాడు.


తాజాగా ఆయన ప్రధాని మోడీపై విరుచుపపడ్డాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన మోడీపై కౌంటర్లు వేశాడు. కర్ణాటక ఎన్నికల నిమిత్తం ప్రచారం నిర్వహిస్తూ మోడీ, ఉత్తర కర్ణాటకలోని ముధోల్ కు చెందిన శునకాలు సైన్యంలో సేవలు అందిస్తున్నాయని, వాటిని చూసైనా కాంగ్రెస్ నాయకులు దేశ భక్తిని అలవరచుకోవాలి చెప్పారు. దానికి ప్రతిగా ప్రకాష్ రాజ్, మీకు ఓట్లు వేసేది శునకాలు కాదని, మనుషులు అని మోడీకి కౌంటర్ వేసాడు.


తాను దళితుల ఆశాకిరణం అని మోడీ చెప్పుకుంటున్నారని, ఒక్కరోజు దళితుల ఇంటిలో భోజనం చేస్తే దళిత నాయకుడివయిపోతావా అని ప్రశ్నవేశారు. ఫిబ్రవరి  పద్నాలుగున ఒక జంట కనపడితే చాలు వారిపై బీజేపీ కార్యకర్తలు విరుచుకపడతారని, వారు అన్నాచెల్లెలా, భార్యాభర్తలా  అని ఆలోచించకుండా దాడులు చేస్తారని చురకలు అంటించాడు. మరి దాడులు చేసిన వారిపై కేసులెందుకు పెట్టరని మోడీకి మరో ప్రశ్న వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: