భారత దేశంలో ఎంతో ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రం తిరుపతి.  ప్రతినిత్యం రుమల శ్రీవారి దర్శనం కోసం  వేల మంది వస్తుంటారు.  అయితే  శ్రీవారి దర్శనం కోసం క్యూకాంప్లెక్స్‌లో వేచివుండే భక్తులకు టిటిడి నిరంతరం అన్నపానీయాలు పంపిణీ చేస్తుంది. ఉదయం ఉప్మా, పొంగల్‌, కిచిటీ, మధ్యాహ్నం సాంబారు అన్నం, పెరుగన్నం, రాత్రి ఉప్మా, పొంగల్‌ వంటివి పెడుతుంది. అంతే కాదు ప్రధాన కూడళ్లలో కూడా ఉచితంగా ఈ అల్పాహారం అందజేస్తుంది. 
Image result for tirumala queue complex
అయితే ఇవి యూజ్ అండ్ త్రో (వాడిపారేసే కప్పు) ల్లో వడ్డిస్తుంటారు.  కాకపోతే ఇలా ఇచ్చే వాటిలో స్ఫూన్స్ ఉండవు.  దాంతో ప్రధానంగా క్యూకాంప్లెక్స్‌లో చేతులు కడుక్కోడానికి నీళ్లు అందుబాటులో ఉండవు. బాత్‌రూంల వద్ద ఉన్నా ఒక్కోసారి షెడ్‌లకు తాళాలు వేసివుంటారు. ఇలాంటప్పుడు ఆహారం అందజేసినా…తినడానికి ఇబ్బందిపడుతున్నారు. తినేసి చెయ్యి కడుక్కోకుండా స్వామి దర్శనానికి వెళ్లలేరు. 

కొన్ని సార్లు  వేడి వేడిగా సాంబరు అన్నం తినాలంటే చుక్కలు కనిపిస్తుంటాయి. ఉత్త చేత్తో తినాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  దాంతో కొంత మంది వాటిని సున్నితంగా వద్దని కూడా చెబుతుంటారు. 

అయితే ఇవన్నీ గమనించిన టిటిడి క్యూ కాంప్లెక్స్‌లో ఆహారం ఆరగించడానికి వాడిపారేసే స్పూన్లనూ అందజేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైలు ఓకే అయినట్ల సమాచారం. వారం పది రోజుల్లోనే స్పూన్లు రెడీ కానున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: