ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే అధికార పార్టీ లో చలనం రావడం కోసం ప్రతిపక్ష పార్టీ ర్యాలీలు నిర్వహించడం చూశాము. కానీ ఏపీ లో మాత్రం దీనికి విడ్డురంగా జరుగుతుంది. ఏకంగా అధికార పార్టీ అయినటువంటి టీడీపీ ఆడపిల్లల మీద అత్యాచారాలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించడానికి సిద్ధం అయిపొయింది. అస్సలు ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో తెలియక అందరు నివ్వెర పోతున్నారు. అధికార పార్టీయే ర్యాలీలు చేస్తే ఇక  రాష్ట్రం లో ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారని అందరు ప్రశ్నిస్తున్నారు. 

Image result for tdp

అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాల విషయంలో తెలుగుదేశం చేయగలుగుతున్నది ఒక ర్యాలీ! అంతకు మించిన రాజకీయం. ఇది చేయగలుగుతోంది కానీ.. చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ ఇంతకు మించి సాధించిగలిగినది ఏమీ లేదని స్పష్టం అవుతోంది. ఒకవైపు జగన్ నామస్మరణ.. సచివాలయంలో నీళ్లు లీకైనా, వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన చిన్నభవనం నాణ్యతలోని డొల్లనం బయటపడినా అది జగన్ కుట్ర అని చెప్పుకోవాల్సిన హీన పరిస్థితుల్లో ఉంది చంద్రబాబు పాలన.

Image result for tdp

ఇక చంద్రబాబేమో వచ్చే ఎన్నికల్లో తనకు 25ఎంపీ సీట్లు ఇస్తే అద్బుతాలు సాధిస్తా అంటున్నాడు. తన చేతిలో ఇప్పుడు 20 మంది ఎంపీలున్న విషయాన్ని మరిచిపోయినట్టుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు. ఈ వైఖరి అంతా గమనిస్తుంటే.. తెలుగుదేశం పార్టీ చేతగాని తనానికి ప్రతిపక్ష పాత్రే కరెక్టేమో! లేకపోతే అత్యాచారాలకు అడ్డుకట్ట వేడయానికి, ఆడపిల్లలకు రక్షణగా.. ఈ భద్రతాదళాన్నో ఏర్పాటు చేస్తామని అనకుండా.. ర్యాలీలు తీయడమా..!


మరింత సమాచారం తెలుసుకోండి: