"కలకంటి కంట కన్నీరొలకిన సిరి ఇంట నుండ నొల్లదు" అనేది ఒక సామాజిక బావన. ఇది భారతీయ సంస్కృతి అంత రాంతరాల్లో నిబిడీకృతమై ఉంది. ఇది మగువలు ప్రత్యేకించి ఇల్లాళ్లు అంటే ఆ కుటుంబానికి అమ్మలే, తల్లులే, మాతృమూర్తులే. అందుకే మాతృదినోత్సవం అనే దానికి ఒక రోజు నియమించ బడలేదు. సాంస్కృతికంగా మాతృదేవోభవ అంటూనే ఉంటాం. అమ్మ దైవమే. ఇంకా ఎక్కువే. దైవాన్ని సంవత్సరంలో ఒక రోజు మాత్రమే పూజించే ఆచారం లేదు, భారతీయులు దైవాన్ని ప్రతిరోజూ పూజిస్తారు కాబట్టి మనకు ప్రతిరోజూ మాతృదినోత్సవమే.

mothers day 2018 pictures & quotes in telugu కోసం చిత్ర ఫలితం

అమ్మదనం కల్మషం అవుతున్నందునే - దేశంలో అమ్మలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. అమ్మలే ఈ సామాజిక దౌర్భల్యాన్ని నిర్మూలించాలి తన సంతానాన్ని సంస్కరించగలిగేది అమ్మ మాత్రమే. అమ్మ మాతృదినోత్సవ స్పూర్తిగా ఒక అమ్మదనాన్ని ప్రవాహం రూపంలో ప్రతి మూర్ఖునికి అందించాలి. 

mother and child painting కోసం చిత్ర ఫలితం

భారతీయ సమాజంలో "అమ్మతనం" అన్నదానికి విశిష్ట స్థానం ఉంది. అమ్మంటే అద్భుతం, ఆత్మీయత, అనురాగం, అనుబంధం. అమ్మ ప్రేమ తోనే మగువల మనుగడ అద్భుతంగా కొనసాగుతూవస్తుంది. మగువ కంట కన్నీరు ఒలకటాన్ని భారత సమాజం హర్షించదు. ఈక అమ్మ అంటే అమృతమే ఆరాధ్యనీయమే కదా!

 

మదర్స్ డే లేదా మాతృదినోత్సవం అనేది సాధారణంగా మాతృత్వం, మాతృమూర్తులు మరియు వివాహబంధాలకు గుర్తుగా మరియు అమ్మగా సమాజానికి మగువలు చేసిన చేస్తున్న ప్రత్యక్ష సేవలను గుర్తించేందుకు జరుపుకునే ఒక వార్షిక దినం. మనదేశంలో లాగే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో (యునైటెడ్ స్టేట్స్) దీనిని మే నెల రెండో ఆదివారం జరుపుకుంటారు.  ప్రపంచం ఒక కుగ్రామం అయినవేళ పాశ్చాత్య సంస్కృతి ప్రాభవం మూలంగా విస్తృతిలో ఈ మధర్స్ డే భారత్ లోనూ ప్రవేసించింది. రోజూ అమ్మను పూజించే మనం ప్రత్యేకించి ఆ ఒక్క రోజూ మరింత ప్రత్యేకంగా పూజిస్తాం. 

mother and child images కోసం చిత్ర ఫలితం

"మర్మ స్థానం కాదది,  నీ జన్మ స్థానం, మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం" ప్రముఖ  సినీ గేయ రచయిత వేటూరి సుందరామ్మూర్తి రాసిన ప్రతిఘటన సినీ గేయం లోని ఒక బాగం  ఇది. తల్లిగా ఒక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ఇంతకన్నా గొప్పగా వర్ణించటానికి సాధ్యంకాదు భావం బాష రెండూ చాలవు. కేవలం రెండు పంక్తు లలోనే మగువ – అందులోని అమ్మపై అద్భుత భావాన్ని  వేటూరి అతి సాధారణ పదాలతో వ్యక్తీకరించగలిగారు.

pratighatana ee dhuryodhana కోసం చిత్ర ఫలితం

"మదర్స్-డే" ప్రస్థానం గురించి మీకు తెలియని విషయాలు! ప్రతీ సంవత్సరంలాగే ఈ ఏటా మే రెండో ఆదివారం (13.05.2018) మదర్స్ డే జరపుకోవడానికి ప్రపంచ మంతా సిద్దమవుతోన్న తరుణంలో, అసలు మాతృమూర్తులకు ఎంతమేర సమానత్వం, స్వేచ్చ, గౌరవం దక్కుతు న్నాయన్నది ఆలోచించ వలసిన అంశం. ఒక్క రోజుకే పరిమితం చేయకూడదు. మాతృమూర్తుల సేవలను గుర్తుచేసు కోవడం కోసం ఒక రోజంటూ ఏర్పడటం నిజంగా హర్షించదగ్గ విషయం.

 

అదే సమయంలో దీన్ని ఒక్కరోజుకే పరిమితం చేయడం కూడా సక్రమం కాదు. అలాగే కేవలం మదర్స్ డే నాడు ఉపన్యాసాలకో , వేదికల మీద ఫోటోలకు పోజులకో ఇలాంటి కార్యక్రమాలు పరిమితమైతే దీని అసలు ఉద్దేశం దెబ్బతింటుంది.

mother and child images కోసం చిత్ర ఫలితం

మరేం చేయాలి? స్త్రీలకు అంతటా సమాన ప్రాధాన్యం దక్కిన రోజు, హింస నుంచి వారు విముక్తి చేయబడ్డ రోజు, భ్రూణహత్యల బారి నుంచి ఆడశిశువులను రక్షించిన రోజు, మగువలను లైంగిక అత్యాచారాల భారీన పడకుండా రక్షించగల సమాజం నిర్మించబడిన రోజున మనం సరైన మాతృదినోత్సవం జరుపుకున్నట్లు. 'నేటి  పసిపిల్లలు రేపటి మాతృమూర్తులు'  ధారుణ లైంగిన హింసకు గురిచేసే ఈ దేశానికి మాతృదినోత్సవం జరుపుకునే అర్హత ఉందని అందామా?  అందుకే ఇంట్లో అమ్మ నుంచి ప్రారంభించి సమాజంలో ప్రతి మగువను కాపాడు కోవటం పురుషుని బాధ్యతగా భావించే "పురుషుల శీల నిర్మాణం"  జరిగిన రోజున ఈ ప్రపంచానికి మరింత మంది గొప్ప మాతృమూర్తు లను భారత్ అందించగలుతుంది. 

mother and child images కోసం చిత్ర ఫలితం

ముఖ్యంగా “పితృస్వామ్య వ్యవస్థ” కు చెందిన భావజాలాన్ని వదలిపెట్తి,  స్త్రీ-పురుషులు సమానులే అనే సమానత్వం సాధించిన రోజు, మాతృమూర్తులకు నిజమైన గౌరవం దక్కినట్లు గా భావించాలి. 

mother and child images కోసం చిత్ర ఫలితం

అప్పుడే అమ్మ, నాన్నతో సమానం అనే కొటేషన్ “మేలుకొలుపు” అనే గ్రంధంలో, ఒకానొక చోట రచయిత అరుణ్ సాగర్ "అమ్మంటే నాన్నంత సమానం, నాన్నంటే అమ్మంత సమానం" అని చెబుతారు.  తల్లి దండ్రుల్లో ఎవరు గొప్ప అన్న ప్రశ్న వచ్చినప్పుడు, ఒక్కసారి ఈ వాక్యం గుర్తు చేసుకుంటే చాలు. అయితే ఆర్థికంగా, సామాజికంగా తండ్రి ఎలాంటి హోదాను, స్వేచ్చ  ను అనుభవిస్తారో, తల్లికి కూడా అలాంటి స్వేచ్చ లభించినప్పుడే వారికి నిజమైన ఆదరం, గౌరవం దక్కుతుందని  భావించాలి. అమ్మ విలువ తెలిసిన భారత సమాజం తొలుత మాతృ దేవోభవ, తరువాత పితృ దేవోభవ ఆపై ఆచార్య దేవోభవ అంటూ ఉంటాం.

mother and child images కోసం చిత్ర ఫలితం

అమ్మను ఆరాధించటం మానేసిన సమాజలోని కొందరికి మగువలంటే అలక్ష్యం అగౌరవం వస్తుసమానం అయింది. పలితంగా స్త్రీని చూసే ఆ చూపులోనే కల్మషం కలిసి నేడు భారత దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పసి బాలుడు నుండి పండు ముదుసలి వరకు - మగువపై మదమెత్తిన మృగాలై పసి పాప నుండి పండు ముసలి మగువపై చేయరాని అత్యాచారాలు చేస్తున్నారు. కారణం నేటి అమ్మలు తమ పిల్లలు అంటే కొడుకులు కూతుళ్ళకు మంచి స్పర్శకు చెడు స్పర్శకు భేదమేమి టో చెప్పక పోవటమే అంతకు మించి అమ్మాయిలతో ఎలా మసులు కోవాలో, అమ్మాయిలను ఎలా గౌరవించుకొవాలో ఇంటివద్ద నుండే నేర్పక పోవటమే.

mother and child images కోసం చిత్ర ఫలితం

నేడు అమ్మలు ఉద్యోగినులు, సమయం దుర్లభం. పిల్లల పోషణ జీత బత్యాలతో పనిచేసే వారి చేతిలో పెట్టటం. అంటే వారి పెరుగుదల, సమాజంలో పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు అంతా వాణిజ్యమే. అందుకే తమ సహాద్యాయులు, సహోద్యోగులు, మొత్తం లింగ బేధం లేకుండా వస్తువులు లాగా చూడటం వారి జన్మ సమయం నుండే మారిపోయింది. అందుకే అబలల కంటే పశుబలం ఎక్కువ ఉండే మగవారికి మగువలు వస్తు సమానం అయిపోయింది. అందుకే ఇప్పటికీ "అమ్మ" లు గా తమ బాధ్యత మరువని అమ్మలందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: