ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి రావడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే అంశంపై చర్చలు మొదలయ్యాయి.  ఏసీబీ పనితీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్  ప్రగతి భవన్‌లో నాలుగైదు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఓటుకు నోటుపై చర్చించారు. ఆ కేసుతో పాటు గత ప్రభుత్వాల హయాంలో నమోదు చేసిన కీలకమైన కేసులపై చర్చించారు. సీఐడీ, విజిలెన్స్‌ - ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న ముఖ్య కేసులు అందులోనూ రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటన్నింటిపైనా ఆరా తీశారు.
పలువురి అనుమానాలు
ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబుకు చెడిన నేపథ్యంలో ఈ కేసు తెరపైకి వచ్చిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఈ కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఓటుకు నోటు కేసులో విషయంలో ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సంచలన ఆరోపణలు చేశారు.  ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు జైలుకు వెళ్లాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు.
చంద్రబాబును ఎవరూ ఏం చేయలేరు
ఇప్పటికైనా ఈ కేసు విచారణ వేగంగా కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. తన ప్రియ శిష్యుడు రేవంత్ రెడ్డిని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలోకి పంపించారని... రేపొద్దున కాంగ్రెస్ అవసరం వస్తే ఉపయోగకరంగా ఉంటుందనే ఇలా చేశారని అన్నారు. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడికి ముందు చూపు ఎక్కువగా ఉంటుందని..ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అనే భావనతోనే ఇలా చేశారని దుయ్యబట్టారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటని, వైసీపీకి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. 
అప్పట్లో రాజకీయ దుమారం
ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంగా చిన్నారులపై జరిగిన అత్యాచార పర్వం చూస్తుంటే..ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఉందో అర్థం అవుతుందని..చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. అమరావతికి వచ్చిన కేసీఆర్ కు 38 రకాల వంటలతో చంద్రబాబు విందు ఇచ్చారని... ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఆయన ఇదంతా చేశారని ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: