రాజ‌కీయాల్లో ఉండ‌కూడ‌నిది.. రాజ‌కీయ నేత‌లు ఇష్ట‌ప‌డ‌నిది.. ఎదుటి వారు ప్ర‌శ్నించ‌డం! ఎదుటి వారు త‌మ‌కు ప్ర‌తిబం ధకంగా మాట్లాడ‌డం. అంతేకాదు, త‌మ హ‌క్కుల‌ను కోరుకోవ‌డం కూడా!! ఇలా ప్ర‌శ్నించేవారిని అణ‌గ‌దొక్క‌డం, నిల‌దీయ డం అనేవి ఎన్నాళ్లుగానో కొన‌సాగుతున్నా.. ఇప్పుడు ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో మ‌రింత‌గా ఈ ధోర‌ణి పెరిగిపోయింది. త‌మ‌ను ప్ర‌శ్నించేవారిపై క‌క్ష సాధింపు రాజ‌కీయాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా త‌మ‌ను ప్ర‌శ్నించడా న్ని జీర్ణించుకోలేక పోతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌శ్నించే వారిని అణ‌గ‌దొక్క‌డాన్ని కామ‌న్‌గా పెట్టుకుంది. ఇప్పుడు ఇలాంటి సిట్యుయేష‌నే ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎదుర్కొంటున్నారా?  ఆయ‌న చుట్టూ క‌క్ష సాధింపు రాజ‌కీయాలు స్టార్ట‌య్యాయా? ప‌్ర‌తీకార రాజ‌కీయాల్లో బాబు స‌మిధ అవుతారా? అంటే.. ఢిల్లీ కేంద్రంగా హైద‌రాబాద్‌లో క‌దులుతున్న `పాలిటిక్స్‌` ఔన‌నే స‌మాధాన‌మే ఇస్తున్నాయి. 

Image result for andhra pradesh

విష‌యంలోకి వెళ్తే.. గ‌డిచిన రెండు నెల‌లుగా కేంద్ర ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు అండ్ టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్నారు. అసలు ప్ర‌ధాన విప‌క్షం కాంగ్రెస్‌ను మించి కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతు న్నారు. అంతేకాదు, త‌న‌కంటే మొన‌గాడు లేడ‌ని, తానే నెంబ‌ర్ -1 ప్ర‌ధానిన‌ని  ప్ర‌చారం చేసుకునే న‌రేంద్ర మోడీకి చుక్క‌లు చూపిస్తున్నారు చంద్ర‌బాబు ఆయ‌న బృందం. ఎన్డీయే కూట‌మి నుంచి బ‌య‌ట‌కు రావ‌డం మొద‌లు.. మంత్రుల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డం, ఎంపీల‌తో అవిశ్వాసం నోటీసులు ఇప్పించ‌డం వంటి కీల‌క అంశాల్లో చంద్ర‌బాబు వేసిన అడుగులు మోడీ అండ్ బీజేపీకి ముద్ద‌కూడా దిగ‌కుండా చేశాయి. ఢిల్లీ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు గ‌త నెల 20న సాక్షాత్తూ చంద్ర‌బాబు త‌న పుట్టిన రోజును ప‌క్క‌న పెట్టి చేసిన ధ‌ర్మ పోరాట దీక్షకు దిగిన విష‌యం తెలిసిందే. 

Image result for bjp

అయితే, ముందు రోజు రాత్రి బీజేపీ సార‌థి తెల్ల‌వార్లూ.. చంద్ర‌బాబు గురించే స‌మాలోచ‌న‌లు చేశారంటే.. ఏ స్తాయిలో చంద్ర‌బాబు వారికి షాకిచ్చారో అర్ధ‌మ‌వుతోంది. పైన చెప్పుకొన్న‌ట్టు.. త‌మ‌కు ప్ర‌శ్నించేవారికి షా కానీ, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కానీ ఊరుకుంటారా? అదే జ‌రుగుతోంది! చంద్ర‌బాబును ఇరుకున పెట్టేలా, ఆయ‌న‌ను ఇబ్బందుల పాలు చేసేలా చేతికి మ‌ట్టి అంట‌కుండా.. చ‌క్రం తిప్పుతున్నా రు. ఈ క్ర‌మంలోనే రెండేళ్ల కింద‌ట జ‌రిగిన‌, చంద్ర‌బాబుకు సంబంధం ఉందో లేదో కూడా తెలియ‌ని ఓటుకు నోటు కేసును తిర‌గ‌దోడేందుకు ఢిల్లీ స్థాయిలో ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఈ కేసు పూర్వాప‌రాల‌పైనా, సుప్రీం కోర్టులో కౌంట‌ర్ వేసే విష‌యంపైనా రాష్ట్ర ఉన్న‌త‌స్థాయి అధికారుల‌తో భేటీ అయి చ‌ర్చించ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. 

Image result for chandrababu

వాస్త‌వానికి ఈ కేసులో బాబు పాత్ర‌పై ఇప్ప‌టికే సందేహాలు వీడ‌లేదు. అంతేకాదు, గ‌డిచిన రెండు సంవ‌త్స‌రాలుగా ఈ కేసు అట‌కెక్కింది. అయితే, ఇప్పుడు మాత్రం హ‌ఠాత్తుగా తెర‌మీదికి రావ‌డం అంటే.. కేంద్రం క‌క్ష సాధింపు కాక మ‌రేమిటి? అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం.. ఏ పీ ప్ర‌జ‌ల కోసం త‌న కుటుంబాన్ని సైతం ప‌క్కన పెట్టి 68 ఏళ్ల వ‌య‌సులో కూడా 28 ఏళ్ల యువ‌కుడిగా క‌ష్ట‌ప‌డుతున్న చంద్ర‌బాబును ఇరుకున పెట్ట‌డం అంటే ఏపీ మొత్తాన్ని ఇరుకున పెట్ట‌డ‌మే! ఇది ఒక్క బాబు స‌మ‌స్య కాదు.. 5 కోట్ల మంది ప్ర‌జ‌ల స‌మ‌స్య‌. కేంద్రానికి బుద్ధి చెప్పాల్సిన అవ‌స‌రం బాబు క‌న్నా.. ఏపీ ప్ర‌జ‌లకే ఎక్కువ‌గా ఉంది. ఈ విష‌యంలో బాబు ప‌క్షాన నిలిచి.. ఆయ‌న శ్ర‌మ‌కు కూలి ఇద్దాం!!


మరింత సమాచారం తెలుసుకోండి: