దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ అధికారంలోకి రాదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మాత్రం మోదీ ఏదో మాయ చేస్తున్నారు. ఆయన చరిష్మా అంతకంతకూ పెరుగుతోంది.

Image result for modi in forbes

          ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీకి స్థానం దక్కింది. గతంలో ఎవరికీ దక్కని విధంగా మోదీకి టాప్ టెన్ లో చోటు దక్కింది. అత్యంత శక్తిమంతులైన జాబితాలో నరేంద్ర మోదికి 9వ స్థానాన్ని కట్టబెట్టింది ఫోర్బ్స్. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకమైనదని ఫోర్బ్స్ కొనియాడింది. వాస్తవానికి పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో కరెన్సీ అందుబాటులో లేదని, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని అందరూ కోడై కోస్తున్నారు. అయితే అదే నిర్ణయాన్ని పొగుడుతూ మోదీని మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్స్ జాబితాలో 9వ స్థానం కల్పించింది.

Image result for modi in forbes

          మోదీకి 9వ స్థానం దక్కగా రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీకి 32వ స్థానం, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్లకు 40వ స్థానం దక్కింది. ఇక ఫస్ట్ ప్లేస్ లో చైనా అధినేత కిమ్ జాంగ్ నిలిచారు. సెకండ్ ప్లేస్ లో పుతిన్ 2వ స్థానంలో, ట్రంప్ 3వ స్థానంలో నిలిచారు. వీళ్లందరితో సమానంగా మోదీ కూడా అగ్రస్థానంలో నిలవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మోదీపై దేశంలో కాస్త అసంతృప్తి ఉన్నా విదేశాల్లో మాత్రం మోదీ తన హవా చాటుకుంటున్నట్టు దీన్నిబట్టి అర్థమవుతోంది. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు ప్రతినెలా ఓ విదేశీ పర్యటనకు వెళ్లినట్లు లెక్కలు చెప్తున్నాయి. దీంతో విదేశీ వ్యవహారాపై మోదీ మంచి పట్టు సాధించారని చెప్పుకోవచ్చు.

Image result for modi in forbes

          అయితే విదేశాంగ విధానంలో మోదీ సాధించిందేమీ లేదని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. మోదీ ఎప్పుడూ ఫ్లయింగ్ మోడ్ లోనే ఉంటారని, వర్కింగ్ మోడ్ లో ఉండరని రాహుల్ గాంధీ ఇటీవలే విమర్సించారు. ఆయనకు విదేశాలకు వెళ్లాలనే శ్రద్ధ తప్ప దేశంలోని సమస్యలపై లేదని విపక్షాలన్నీ విమర్శిస్తున్నాయి. కానీ మోదీ ఏనాడూ ఈ విమర్శలను పట్టించుకోవడం లేదు. తన విదేశీ పర్యటనలను ఆపడం లేదు. తను యధాతథంగా తన పని తాను చేసుకుపోతున్నారు. బహుశా అదే ఇప్పుడు మోదీని పవర్ ఫుల్ పర్సన్స్ జాబితాలో నిలిపిందేమో..!


మరింత సమాచారం తెలుసుకోండి: