పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఎప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారో ఎవరికి అర్థం కావటం లేదు. ఆఖరికి సొంత పార్టీ నేతలకు కూడా పవన్ వైఖరి అర్థం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. గతంలో గుంటూరులో జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించడం జరిగింది. అయితే ఆ తరువాత ఆ దీక్ష గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్.
Image result for pawan kalyan
ఈ క్రమంలో మరి కొద్ది రోజులలో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగువారు ఎక్కువగా ఉండే  బళ్లారి, చిక్ బళ్లాపూర్ ఏరియాల్లో పవన్ సామాజికవర్గం ఎక్కువ ఉంది. అభిమానించే యువత ఉంది . అందుకే ఏ ఎన్నికలొచ్చినా.. కచ్చితంగా అక్కడ మెగా ఫ్యామిలీ ప్రచారం ఉంటుంది. గత ఎన్నికల సమయంలో చిరంజీవి కాంగ్రెస్‌కు ప్రచారం చేశారు. ఈ సారి కూడా.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు ఉంది.
Related image
కానీ ఇప్పటి వరకు షెడ్యూల్ ఖరారు కాలేదు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం.. బళ్లారి, చిక్ బళ్లాపూర్ ఏరియాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తన ఇద్దరు ఫ్రెండ్స్ కోసం ప్రచారం చేసేందుకు అంగీకరించారు. వాళ్లు డేట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ పవన్ మాత్రం వారికి ఇప్పుడు యాక్సెస్ ఇవ్వడం లేదట. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఇద్దరి స్నేహితులకు ఎక్కడ పోటీ చేస్తున్నారు అక్కడ మంచి పలుకుబడి ఉంది.
Image result for pawan kalyan
అంతేకాకుండా డబ్బు పరంగా కూడా బాగా సంపన్నులే అని చెప్పవచ్చు ...మరియు అదే విధంగా మెగా హీరోల సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసేది కూడా వీరిద్దరి అనే టాక్ ఉంది. ఇంతగా మెగా కుటుంబాన్ని ప్రేమించే వీరిద్దరికి ఎన్నికల వేళ ప్రచారానికి వస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ హ్యాండ్ అవ్వడం వీరిద్దరికీ వెన్నుపోటు పొడిచినట్లయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: