విలక్షణ నటుడు విలక్షణ వ్యక్తిత్వమున్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు సినిమాల్లో కంటే, రాజకీయల్లో కంటే రాజకీయ వివాదాల్లోనే విలక్షణంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక రాజకీయ పార్టీలపై ఆయన మాటల బుల్లెట్స్ పేలుస్తూ రోజూ వార్తలను వేడెక్కిస్తున్నాడు.   ముఖ్యంగా బీజేపీపై ఆ పార్టీ అధినేతలు నరెంద్ర మోడీ, అమిత్ షాలపై తీవ్రవ్యాఖ్యలు చేస్తున్న ప్రకాష్ రాజ్,  పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తిగా స్పందదించారు.  


రాజకీయపార్టీలను తనకు తోచిన విధంగా ఉతికి ఝాడించి ఆరేస్తున్న నటుడు ప్రకాష్ రాజ్, తనదైన సినీపక్కీ వాక్-శైలిని వాడుతూ దూసుకుపోతున్నారు. ఆయన త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే, అవన్నీ పుకార్లు మాత్రమేనని, తాను రాజకీయాల్లోకి రాబోనని స్పష్టంచేశారు. ఎంపీ లేదా ఎమ్మెల్యే హోదాల కోసం తాను ఎన్నికల్లో పోటీ చేయనని, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మాత్రమే పనిచేస్తానని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. 
prakash raj advises pavan kalyan కోసం చిత్ర ఫలితం
"జనసేన" పార్టీతో జనాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై, ప్రకాష్ రాజ్ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయనకు కొన్ని సూచనలు చేశారు "పవన్ కళ్యాణ్ ముక్కు సూటి మనిషి, ఆయనకు బోలెడంత పాపులారిటీ ఉంది. చాలామంది ఆయన పార్టీలో చేరతారు" అని తెలిపారు. పార్టీలో చేరే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్‌ కు ప్రకాష్ రాజ్ సూచన చేస్తూ ఒక రకంగా హెచ్చరించారు కూదా! అవకాశవాదులైన కళన్కిత రాజకీయ నేతలతో పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పవన్ రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నానని, కానీ, ఆయనలా తనకు రాజకీయ పార్టీ పెట్టేఉద్దేశం లేదని చెప్పారు.


"నేను కూడా ఆయన లాగానే ప్రశ్నిస్తా! ప్రభుత్వంలో, రాజకీయాల్లో తప్పులు చేసే పెద్దలను ప్రశ్నిస్తా! ఎవరు తప్పు చేసినా నిలదీస్తా! నని అన్నారు. పవన్‌ తో ప్రకాష్ రాజ్ "బద్రి, కెమేరామేన్ గంగ తో రాంబాబు, జల్సా" ఇలా కొన్ని సినిమాల్లో నటించారు. (గత నాలుగేళ్ళుగా తెలుగు ప్రజలందరికి తెలుసు పవన్ కళ్యణ్ ఎలా ప్రశ్నిస్తారో! ) 
muslim population rose in india కోసం చిత్ర ఫలితం

2019ఎన్నికల్లో నరేంద్ర మోడీకి ఓటమి తప్పదని ప్రకాష్ రాజ్ అన్నారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, దేశంలో మరెక్కడా ఆయనకు విజయం లభించదని అనారు. 

బీజేపీ హిందూత్వ వాదన,  హిందూ ధర్మానికి విరుద్దంగా ఉందని తెలిపారు. 


అయితే ప్రకాష్ రాజ్ ప్రజలకు సమస్యలు మాత్రమే చూపారు ఒక ప్రత్యామ్నాయం కూడా రాజకీయంగా చూపించాలని ప్రజలు అంటున్నారు. తానొక నటుడు కావటం వలననే  ప్రజలు తన మాటలపై శ్రద్ధ పెడతారు. ప్రజలు వింటున్నారు కదా! అని మనం మనసులోని సిద్ధాంతాలను వారిపై రుద్ధ కూడదు అని కన్నడిగులు అంటున్నారు. ఆయన మాత్రం ప్రజలకు చేసిందేముందని ప్రశ్నిస్తున్నారు.  


ప్రజల ప్రశ్న ప్రధానంగా ఒక్కటే కేసిఆర్, చంద్రబాబు, సిద్ధరామయ్య, రాహుల్ గాంధి, అఖిలేష్ యాదవ్ మొదలైన వారు నరెంద్ర మోడీ కంటే ఏవిధంగా మెరుగైన వాల్లో చెప్పాలని, కనీసం నేడు ప్రపంచంలో భారత్ ఒక సమర్ధవంతమైన దేశంలాగా కనపడనైనా కనపడుతుంది అంటూ అన్నీ కుక్కమూతి పిందెలైనప్పుడు ఎవడైనా ఒకటే. అలాంటప్పుడు ప్రకాష్ రాజ్ చూపించే రాహుల్ గాంధికి ఆ కనీస సామర్ధ్యం ఉందా? అన్నదే పెద్ద ప్రశ్నని అంటున్నారు. 


ప్రకాష్ రాజ్ కాకపోవచ్చు, అనేక మంది హిందూ వ్యతిరెఖులు నరెంద్ర మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరెఖించే వాళ్ళలో ఉన్నారు. అధికసంఖ్యాకులైన హిందువులను తొక్కేసి అల్ప సంఖ్యాకులైన హిందూయేతర సమాజాలను అభివృద్ది చేతే మాత్రం భారత్ కు ఒరిగే ప్రయోజనమేముందని అంటున్నారు.  
hindus tarchered in pak కోసం చిత్ర ఫలితం
ఒక్కసారి భారత్ నుండి విడిపోయిన పాకిస్థాన్ ఏమంత ప్రశాంతంగా ఉంది? ఇక్కడ కనీసం హిందూయేతర వర్గాలు హిందువులతో సమానంగా జీవిస్తున్నారు. మరి పాకిస్తాన్ లో  హిందువుల పరిస్థితి ఏమిటో ఊహించలేరా? ఎందుకు అల్ప సంఖ్యాకుల పై ప్రకాష్ రాజ్ కు ప్రేమ? రాజకీయ నాయకుడైతే ఓట్ల కోసం కక్కుర్తి పడ్డాడని అనుకుందాం. కాని ప్రకాష్ రాజ్ చైతన్యం కోసం మాత్రమే పోరాడతానంటున్నాడు. 


అందుకే: 

భారత రాజ్యాంగం సమానత్వం ప్రవచించిన ప్రసిద్ధ రాజ్యాంగం కదా! మరి ఇక్కడ రిజర్వేషణ్లు ఎందుకు? కుల, మత, ప్రాంత, లింగ విభేదాలు ఎందుకు? ఇవన్నీ కేసిఆర్, చంద్రబాబు, సిద్ధరామయ్య, రాహుల్ గాంధి పాలనలో కనిపించటం లేదా? మతాలు తక్కువయ్యాయనా మరో కొత్త మైనారిటీ మతంగా లింగాయత్ లను గుర్తించిన సిద్దరామయ్య రాజకీయానికి, హిందూత్వ రాజకీయానికి తేడా ఏముంది? ఏ రాయైతేనేమి తలేగా పగలగొట్తుకొనేది ప్రజల అభిప్రాయం.  
hindus tarchered in pak కోసం చిత్ర ఫలితం
 పాకిస్తాన్లో హిందువుల గోల-ఇక్కడ మైనారిటీల కోసం ప్రకాష్ రాజ్ లీల!    

hindus tarchered in pak కోసం చిత్ర ఫలితం

అసలు సంగతేమంటే ప్రకాష్ రాజ్ కు నరెంద్ర మోడీ అమిత్ షాలు నచ్చలేదు. వ్యక్తిగత ద్వేషం తప్ప ప్రకాష్ రాజ్ కొత్తగా ప్రవచించిందేముంది. అందరు రాజకీయ నాయకులు లాగే శుష్క ప్రియాలు శూన్య హస్తాలు మాత్రమే కదా! అది ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఏదో రాజకీయాల్లోకి వచ్చి చేసేస్తానన్న పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కంటే వేల రెట్లు బెటర్.   "డియర్ పవన్ కళ్యాన్! ప్రకాష్ రాజ్ తో కూడా జాగ్రత్తగా ఉండాలి" అంటున్నారు ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: