పవన్ కళ్యాణ్ నేను అనంత పురం నుంచి పోటీ చేస్తానని మూడేళ్లు కిందట చెప్పాడు. అయితే అనంతపురం లో ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ గా మాట్లాడితే అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడు. అస్సలు అనంత పురం నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ గెలవగలడా అని సందేహం రావొచ్చు. ఎందుకంటే అక్కడ ప్రధానంగా టీడీపీకి మరియు వైసీపీ కి కంచు కోట లాంటిది. పవన్ కళ్యాణ్ మాట మార్చడం తనకు అలవాటు కాబట్టి అనంత  పురం నుంచి పోటీ  చేస్తాడని అనుకోలేము.

Image result for pavan kalyan janasena

అయితే ఆయన కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడట. ఈ మేరకు జనసేన వాళ్లు ప్రచారం చేస్తున్నారు. పవన్ ఇక్కడ నుంచి పోటీ చేయనున్నాడని, అందుకు తగ్గట్టుగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని వారు పిలుపునిస్తున్నారు. అయితే ఇది జనసేన అధికారిక ప్రకటన కాదు. జనసేన పార్టీ వారి మాట అంతే. అవనిగడ్డ నుంచి పవన్ పోటీ చేస్తాడు, అందుకు సిద్ధంగా ఉండాలని ఈ ప్రాంత నేతలు అంటున్నారు.

Image result for pavan kalyan janasena

అవనిగడ్డలో ప్రస్తుతం తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మండలి బుద్ధ ప్రసాద్ ఉన్నారు. ఈయన స్వల్ప మెజారిటీతో గత ఎన్నికల్లో గెలిచాడు. 2009ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ ను దెబ్బతీసింది. త్రిముఖ పోటీలో నాటి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మండలి ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: