ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కి రాష్ట్రంలో ప్రజల ఆదరణ అభిమానం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. యాత్రతో జగన్ మీద నమ్మకం అలాగే వైసిపి గ్రాఫ్ కూడా పెరుగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నేరుగా ప్రతిపక్షనేత ప్రజల దగ్గరకు రావడంతో ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఎంతగానో ఆనందిస్తున్నారు. ఈ క్రమంలో గత ఎన్నికలలో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ని ఎంతగానో అసహ్యించుకుంటున్నారు. గత ఎన్నికలలో ఎవరెవరికి అయితే చంద్రబాబు హామీలు ఇచ్చి మోసం చేశారో...వారి గురించి ప్రజా సంకల్ప పాదయాత్ర లో జగన్ ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు జనం నుండి విశేష స్పందన వస్తుంది. యాత్రలో నాలుగేళ్ల నుండి తాము అనుభవిస్తున్న కష్టాలను జననేత జగన్ కు చెప్పుకుంటున్నారు జనం….అలాగే జగన్ కూడా ప్రతి ఒక్కరి భాదను ఓపిగ్గా వింటూ తగిన విధంగా సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ వారికి భరోసా ఇస్తున్నారు.
Image result for jagan prajasankalpa padayatra
ప్రస్తుతం జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కృష్ణా జిల్లాలో సాగుతోంది.ఈ సందర్భంగా అక్కడ ఉన్న దళితులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబుపై మండిపడ్డారు జగన్. ఎన్నికలు దగ్గరపడుతున్నపుడే దళితులపై చంద్రబాబుకు ప్రేమ పొంగుకు వస్తుందని జగన్ మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో దళితుల పట్ల వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా...ఇప్పటికీ దళితులు సమాజం నుండి విపక్ష ఎదుర్కొంటున్నారు..దీంతో పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. టీడీపీ హయాంలో.....గరగపర్రు పెందుర్తి...తరహాలో రాష్ట్రంలో పలు చోట్ల దళితులపై నేటికి దాడులు జరుగుతుండటం సిగ్గుచేటన్నారు.
Related image
ఏకంగా ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి దళితుడిగా ఎవడైనా పెట్టాలనుకుంటున్నారా అని అనడం ఏమిటని ప్రశ్నించారు..ముఖ్యమంత్రి ఇలా ఉంటే ఆ క్యాబినెట్ మంత్రులు దళితులపై దాడులు చేయడానికి ఒడిగడుతున్నారు అని అన్నారు. ఏకంగా తన క్యాబినెట్ లో ఉన్న ఒక మంత్రి దళితులు స్నానం చేయరు శుభ్రంగా ఉండరు అని అనడం ఏమిటని ప్రశ్నించారు.
Related image
ఇటువంటి వ్యక్తులు నా పార్టీలో ఉన్న నా క్యాబినెట్ లో ఉన్నా వెంటనే భర్తరఫ్ చేసి వారికి రాజకీయ జీవితం లేకుండా చేసేవాడినని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. ఈ ఒక్క విషయమే కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని మోసం చేసినవాడు చంద్రబాబు అని అన్నారు. విభజనకు గురై ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమైన హామీ అయిన ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేసిన మోసం ఎవరు మర్చిపోరు అని అన్నారు. ఇలా ప్రతి ఒక్క కోణంలో చంద్రబాబు ఏ విధంగా ప్రజలను మోసం చేశారో వివరిస్తూ జనంకి తెలియజేస్తూ...తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో అది కూడా వారికి చెబుతూ ముందుకు సాగుతున్నారు జగన్.


మరింత సమాచారం తెలుసుకోండి: