తెలుగు ఇండస్ట్రీలో ‘బద్రి’ చిత్రంతో పవన్ కళ్యాన్ సరసన నటించిన నటి రేణు దేశాయ్.  రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా పవన్, రేణు దేశాయ్ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.  వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్నారు.   ప్రస్తుతం పూణె లో ఉంటున్న రేణు దేశాయ్ తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాన్.  తన పిల్లల పుట్టిన రోజు వేడుకలకు..ఏదైనా ఈ వెంట్స్ కి పవన్ వెళ్లి వస్తుంటారు. అంతే కాదు పవన్ కళ్యాన్ గురించి సోషల్ మాద్యమాల ద్వారా స్పందిస్తున్నారు రేణు దేశాయ్.
Image result for pawan kalyan renu desai
ప్రస్తుతం పవన్ కళ్యాన్ ‘జనసేన’ తరుపు నుంచి తెలుగు రాష్ట్రాల్లో బిజీగా ఉన్నారు.  వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనబోతున్న పవన్ కళ్యాన్ పార్టీ పటిష్ట కోసం తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు కొనసాగిస్తున్నారు.  ఇక పవన్ కళ్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే రేణు దేశాయ్ సోషల్ ఎవేర్ నెస్ కార్యక్రమాలలో పాల్గొంటూ తన వంతు పాత్రను సంవర్ధవంతంగా పోషిస్తోంది.
Related image
ఈ మధ్య కాలంలో సినిమాల గురించి కాకుండా సామజిక అంశాల గురించి ఎక్కువగా మాట్లాడటమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఎవేర్ నెస్ తీసుకొస్తున్నారు. పవన్, రేణు కలిసి ఉన్నప్పుడు కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు నడుం కట్టారు. ఆ తర్వాత పవన్ ప్రజా సమస్యల పై స్పందించే తీరు రేణు దేశాయ్ పై ప్రభావం చూపిందని అంటారు కొంత మంది సన్నిహితులు. ఇక  ఆమె ఆంధ్రప్రదేశ్ లో కాకుండా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్రను పోషించాలని భావిస్తోంది. ఆమెకు మరాఠీ బాష అంటే ఎనలేని ప్రేమ.
Image result for pawan kalyan renu desai
అందుకే ఆమె మరాఠీలోనే సినిమాలు తీస్తుంది. మరాఠీ సెంటిమెంట్ తో రేణు దేశాయ్ పాలిటిక్స్ లోకి వస్తారనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.  మహారాష్ట్ర విమెన్ &చైల్డ్ వెల్ఫేర్ మినిష్టర్ పంకజా ముండే తో మంచి పరిచయం ఉందట. మరి అన్నీ కుదిరితే..జేపీ తరఫున రేణు దేశాయ్ పోటీ చేస్తారనే రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: